‘ఓలా’మ్మ.. ‘ఓలా’మ్మ.. ఎంత పని చేశారు

First Published Dec 29, 2016, 4:34 PM IST
Highlights

ఓలా కార్యాలయం ముందు క్యాబ్ డ్రైవర్ల ధర్నా

ఓలా క్యాబ్ ల గురించి సిటీలో పరిచయమే అక్కరలేదు. ఒక్క స్మార్ట్ క్లిక్ తో కారు మన ముందుకు వచ్చేస్తుంది. రీజనబుల్ రేట్లలో సాఫీగా  ప్రయాణం చేసే అవకాశం ఉండడంతో నగరవాసులు ఓలాకు బాగానే దగ్గరయ్యారు.

 

దీంతో సిటీలో ఓలా క్యాబ్ లు విపరీతంగా పెరిగాయి. ఇటు యాజమాన్యానికి అటు క్యాబ్ డ్రైవర్లకు బాగానే గిట్టుబాటు అవుతోంది. అయితే ఇటీవల క్యాబ్ ల సంఖ్య పెరగడం, పోటీ సంస్థలు పుట్టుక రావడంతో డ్రైవర్లకు కంపెనీ సకాలంలో డబ్బులు చెల్లించడం లేదట.

 

కొద్ది రోజులుగా దీనిపై మౌనంగానే ఉన్న డ్రావర్లు శుక్రవారం కూకటపల్లిలోని ఓలా కార్యాలయంకు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

 

దీనిపై శాంతియుతంగా చర్చించాల్సిన యాజమాన్యం బౌన్సర్ల ను రంగగంలోకి దింపడంతో అక్కడ వాతావరణం రణరంగమైంది.

 

డ్రైవర్లు బౌన్సర్లు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

click me!