ప్రియాంక రెడ్డి కేసు: స్కూటీ పార్క్ చేయడం చూసి...కాటు వేయడానికి పక్కాగా ప్లాన్

By sivanagaprasad Kodati  |  First Published Nov 29, 2019, 5:24 PM IST

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి


వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పాషా గ్యాంగ్ ఒడిశా నుంచి ఇటీవలే హైదరాబాద్‌లో లోడు వేసేందుకు హైదరాబాద్ వచ్చింది. బుధవారం రాత్రి 10 తర్వాత లారీతో పాటు హైదరాబాద్‌కు రావాలని యజమాని చెప్పడంతో పాషా అతని గ్యాంగ్ పీకల్లోతు మద్యం సేవించారు.

యజమాని దగ్గరకు వెళ్లేందుకు సమయం ఉండటంతో పాషా లారీని శంషాబాద్ టోల్‌గేట్ వద్ద పార్క్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో ప్రియాంక రెడ్డి తన స్కూటీని పార్క్ చేసేందుకు అక్కడికి వచ్చింది.

Latest Videos

undefined

అప్పుడే ఆమెపై కన్ను వేసిన నిందితులు... లైంగిక దాడికి ప్లాన్ చేశారు. ఇందుకోసం టోల్‌ప్లాజా వద్దే మాటు వేసి... ప్రియాంక స్కూటీని పంక్చర్ చేసింది. అనంతరం ఆమె వచ్చే వరకు నిందితులు మద్యం సేవించారు.

ఆమె రాగానే పథకం ప్రకారం పాషా బైక్ పంక్చర్ అయ్యిందని.. దానిని బాగు చేయిస్తామని పది నిమిషాల పాటు వారు దుండగులు డ్రామా ఆడారు. బండి పంక్చర్ వేయించినట్లు బైక్‌ను తీసుకొచ్చిన నిందితులు ఆమెకు అప్పగించారు.

ప్రియాంక బయల్దేరే లోపు ఆమెను కిడ్నాప్ చేసిన పాషా.. పక్కనేవున్న నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లాడు. అనంతరం ప్రియాంక రెడ్డిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమె నోరుమూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని అక్కడే వదిలేస్తే పోలీసులకు దొరికిపోతామని భావించిన నిందితులు... మృతదేహాన్ని మాయం చేయాలని భావించారు.

ప్రియాంక రెడ్డి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టిన పాషా లారీలోకి ఎక్కించి, అక్కడికి దగ్గరలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద మిత్రులతో కలిసి మృతదేహాన్ని తగులబెట్టాడు. అత్యాచారం, హత్య అనంతరం నలుగురు నిందితులు ఎవరి ఇళ్లకు వారిపోయారు. లారీ నెంబర్ ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. 

Also Read:రక్తమోడుతున్నా కరుణించని మృగాలు: ప్రియాంకపై దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు వీళ్ళే..

రాజేంద్రనగర్‌లోని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వద్ద ప్రధాన నిందితుడు పాషా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు ప్రియాంక గురించి తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించలేదని ఆమె తల్లీదండ్రులు ఆరోపిస్తున్నారు.

శుక్రవారం ఉదయం 3.30కి ఎస్‌వోటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీ యజమాని శ్రీనివాస్ రెడ్డి నుంచి డ్రైవర్లు, క్లీనర్ల ఫోన్ నెంబర్లను పోలీసులు తీసుకున్నారు. అయితే సెల్‌ఫోన్లను నిందితులు ఆన్‌లోనే ఉంచడంతో వారిని పట్టుకోవడం సులభమైంది. 

లారీ డ్రైవర్ గా పని చేస్తున్న ముహ్మద్ పాషా, జోలు శివ, జోలు నవీన్, చెన్నకేశవులుగా పోలీసులు గుర్తించారు. ఇకపోతే లారీ డ్రైవర్ మహ్మద్ పాషా మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

జోలు నవీన్, జోలు శివలు అన్నదమ్ముల కుమారులు అని తెలుస్తోంది. చెన్నకేశవులు కూడా స్థానికుడేనని పోలీసులు విచారణలో నిర్ధారించారు. నిందితులు నలుగురు కూడా 35 ఏళ్లలోపు వారే కావడం విశేషం. 

ఈ నలుగురు నిందితులు ప్రియాంకరెడ్డిని అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారని తెలుస్తోంది. ముహ్మద్ పాషా నడిపిస్తున్న లారీని అడ్డంపెట్టుకుని తీవ్రంగా దాడి చేశారని సమాచారం. 

Also Read:Priyanka Reddy: మృగాల చేతుల్లో నరకయాతన, కిటికీ అద్ధాలు ధ్వంసం చేసి......

నలుగురు యువకులే కావడంతో వారు తీవ్రంగా దాడి చేయడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రియాంక చేరుకుందని పోలీసుల విచారణలో తేలింది. బోరున విలపిస్తున్న ఆ మానవ మృగాల మనసు కరగలేదు. 

click me!