
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. కవిత అనే ఈ నవవధువుకు వివాహం అయి 7నెలలే అయింది. మైలార్ దేవ్ పల్లిలోని నేతాజీ నగర్ కు చెందిన చంద్రశేఖర్ తో 7 నెలల క్రితం కవితకు వివాహం అయ్యింది. పెళ్లైన నాటినుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారు. అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక కవిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.