Hyderabad: ఉస్మానియా ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. వైద్య సేవలు పొందడంలో ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక అనేక అడ్డంకులను తొలగిస్తూ.. ఈ సమ్మిళిత క్లినిక్ మొదటి పనిదినం బుధవారం ప్రారంభించింది.
Transgender Clinic-Osmania General Hospital: థర్డ్ జెండర్ కు వైద్యసేవలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ క్లినిక్ కు ప్రారంభించింది. వైద్య సేవలు పొందడంలో ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక అనేక అడ్డంకులను తొలగిస్తూ.. ఈ సమ్మిళిత క్లినిక్ మొదటి పనిదినం బుధవారం ప్రారంభించింది. సెన్సిటైజేషన్ శిక్షణ పొందిన వైద్య నిపుణులతో కూడిన ఈ అట్టడుగు సమూహానికి చెందిన రోగులు ఒకే గొడుగు కింద అనేక రకాల చికిత్సలను పొందుతారు. ప్రస్తుతం వారానికి ఒకసారి బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లినిక్ పనిచేస్తుందని, రద్దీని బట్టి రోజుల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఎండోక్రినాలజిస్టులు డాక్టర్ రాకేశ్ సహాయ్, డాక్టర్ నీలవేణి ట్రాన్స్ జెండర్లకు హార్మోన్ థెరపీ, ఇతర అవసరమైన చికిత్సలు అందించనున్నారు. గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సైకియాట్రీ, యూరాలజీ తదితర విభాగాలు కూడా అవసరమైనప్పుడల్లా సహకరిస్తాయి. సమర్థులైన వైద్యుల బృందంతో పాటు, ప్రభుత్వ సర్వీసులో చేరిన తెలంగాణ తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్లు డాక్టర్ ప్రాచి రాథోడ్, డాక్టర్ రూత్ జాన్ పాల్లను కూడా సమన్వయకర్తలుగా నియమించారు.
'ట్రాన్స్ జెండర్లు ఆరోగ్య సేవలను పొందడం చాలా కష్టం. ఆలస్యంగానైనా ఈ రోజు మాకు క్లినిక్ ఉంది, అక్కడ ఎటువంటి వివక్ష లేకుండా ఉచితంగా చికిత్స అందించబడుతుంది" అని డాక్టర్ ప్రాచి చెప్పారు. కేవలం ట్రాన్స్ జెండర్లకే కాకుండా ఇతరులకు కూడా ఎల్జీబీటీక్యూఐఏ గొడుగు కింద సేవలు అందించడమే ఈ క్లినిక్ లక్ష్యంగా చెప్పారు. జెండర్ డిస్ఫోరియాను గుర్తించడం, జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ సర్టిఫికేట్లను జారీ చేయడానికి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ ప్రాధమిక దృష్టిగా ఉంటాయి. లింగ నిర్ధారణ శస్త్రచికిత్సలు ప్రస్తుతం చేయనప్పటికీ, ఈ సేవను కూడా త్వరలో అందిస్తామని డాక్టర్ ప్రాచి చెప్పారు.
"మేము ఇక్కడ వైద్యాధికారులుగా నియమించబడక ముందే, కమ్యూనిటీ పెద్దలు ఓజిహెచ్లో ట్రాన్ జెండర్ క్లినిక్ కోసం ఒత్తిడి తెచ్చారు. అదృష్టవశాత్తూ, మా సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించారు. మార్గదర్శకాలను రూపొందించడానికి మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేసాము" అని డాక్టర్ రూత్ చెప్పారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ, సవాళ్లను అర్థం చేసుకోవడానికి, స్థిరమైన క్లినిక్ ను స్థాపించడానికి ఈ బృందానికి సమయం పట్టింది. వైద్యులు, ఇతర సిబ్బందికి పలు అవగాహన సదస్సులు, జాతీయ వర్క్ షాప్ నిర్వహించి వారిని ఈ పనికి సన్నద్ధం చేశారని తెలిపారు.