తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో డోపెల్ గ్యాంగర్ లు : ఒకే స్థానంలో, ఒకే పేరుతో అభ్యర్థులు.. ఎక్కడెక్కడంటే...

By SumaBala Bukka  |  First Published Nov 15, 2023, 11:12 AM IST

ఒకే నియోజకవర్గంలో.. ఒకే ఇంటి పేరు, ఒకే పేరు గల అభ్యర్థులు ఉంటే.. ఓటర్లు ఓటు వేసే సమయంలో గందరగోళానికి గురై ఈవీయంలో తప్పుడు మీటా నొక్కే అవకాశం ఉంటుంది. 
 


హైదరాబాద్ :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు తేదీ దగ్గర పడుతోంది. ఇప్పటికే నామినేషన్లు పూర్తయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ కూడా నేటితో  ముగియనుంది. అయితే, ఇక పోటీకి సిద్ధం అనుకున్న అభ్యర్థులకు మరో సవాల్ ఎదురవుతోంది. అదే… ఒకే పేరుతో, ఒకే చోట ఇద్దరు అభ్యర్థులు ఉండడం.  దీనివల్ల ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ తలలు పట్టుకుంటున్నారు.  

హైదరాబాద్ ఎల్బీనగర్ లో బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా, ఇదే నియోజకవర్గంలో సరిగ్గా ఇలాంటి పేరు ఉన్న వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడ్డాడు. దీంతో ఈ విషయాన్ని టిఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లను చీల్చడానికి ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న కుట్రగా.. తమకు రాజకీయంగా నష్టం కలిగించడమే లక్ష్యంగా ఇలా చేశారంటూ తమ ఫిర్యాదులో పేర్కొంది.

Latest Videos

undefined

కొడంగల్ లో కూడా ఇలాంటి విచిత్రమైన పరిస్థితే నెలకొంది. అక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి. కాగా, ప్యాట నరేందర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. దీంతో బిఆర్ఎస్ ఖంగుతుంది. ఇదంతా ఇతర పార్టీలు పన్నుతున్న పన్నాగమే అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఓటు వేసే సమయంలో ఇది గందరగోళానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఒకే నియోజకవర్గంలో.. ఒకే ఇంటి పేరు, ఒకే పేరు గల అభ్యర్థులు ఉంటే.. ఓటర్లు ఓటు వేసే సమయంలో గందరగోళానికి గురై ఈవీయంలో తప్పుడు మీటా నొక్కే అవకాశం ఉందని తెలిపింది. పార్టీ గుర్తులతో పాటు ఇలాంటి పేర్ల గందరగోళం కూడా  ఓట్లను ఒకరికి కాకుండా మరొకరికి పడేలా చేస్తాయని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నియోజకవర్గాల వారీగా ఒకసారి వీరి పేర్లను పరిశీలిస్తే..  ప్రధాన పార్టీలు ఆందోళన చెందడంలో అతిశక్తి లేదని అనిపిస్తుంది. నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో..  ఒకే పేరుతో లేదా ఒకే ఇంటి పేరుతో ఒకే స్థానం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు ఇవి…

1. ముషీరాబాద్        ముఠాగోపాల్ (బీఆర్ఎస్)                ఏం గోపాల్ ( ఏఐహెచ్ సీపీ)
2. సనత్ నగర్        శ్రీనివాస్ యాదవ్ (బీఆర్ఎస్)          ఉప్పలపాటి శ్రీనివాస్ ( యుగ తులసి)
3. గోషామహల్        నందకిషోర్ వ్యాస్ (బీఆర్ఎస్)         శుభం వ్యాస్,  సందీప్ వ్యాస్ ( స్వతంత్రులు)
4. నిర్మల్              అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (బీఆర్ఎస్)     మంతెన ఇంద్రకరణ్ రెడ్డి ( ఏడీఆర్) 
5.  పరిగి               కొప్పుల మహేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్)         మారెడ్డి మహేష్ రెడ్డి( ఏడీఆర్)
6. మహేశ్వరం      సబితా ఇంద్రారెడ్డి  (బీఆర్ఎస్)               మద్ది సబిత ( స్వతంత్ర అభ్యర్థి)
7. మహబూబ్నగర్      వి శ్రీనివాస్ గౌడ్ (బీఆర్ఎస్)         ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ( కాంగ్రెస్),  శ్రీనివాసులు,  సి శ్రీనివాస్ రెడ్డి ( స్వతంత్రులు)
8. అసిఫాబాద్          అజ్మీరా శ్యామ్ నాయక్ ( కాంగ్రెస్)         అజ్మీరా ఆత్మారావు ( బిజెపి),  అజ్మీరా రామ్ నాయక్ ( స్వతంత్రులు)
9. ధర్మపురి           ఎస్ కుమార్ ( బిజెపి)                        అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్)
10. ఖానాపూర్      రమేష్ రాథోడ్ ( బిజెపి)         రితేష్ రాథోడ్ ( స్వతంత్రులు)
11. మునుగోడు      కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్)         కట్ట ప్రభాకర్ రెడ్డి ( ఏడిఆర్)
12. ములుగు         బడే నాగజ్యోతి (బీఆర్ఎస్)         బడే విద్యాసాగర్ ( స్వతంత్రులు)
13.  ముధోల్          పటేల్ నారాయణరావు ( కాంగ్రెస్)         పటేల్ రామారావు ( బిజెపి)
14.  జహీరాబాద్       ఏ చంద్రశేఖర్ ( కాంగ్రెస్)         చంద్రశేఖర్,  ఏం చంద్రశేఖర్,  ఎడ్ల చంద్రశేఖర్ ( స్వతంత్రులు)
15.  నల్గొండ          కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( కాంగ్రెస్)         గుంటోజు వెంకట్ రెడ్డి ( స్వతంత్రులు)
16. ఇబ్రహీంపట్నం       మంచిరెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్)            కే కిషన్ రెడ్డి ( ఏడీఆర్)
17. భూపాలపల్లి         గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్)         గండ్ర సత్యనారాయణ రావు ( కాంగ్రెస్)
18. ఆందోల్               చంటి క్రాంతి కిరణ్ (బీఆర్ఎస్)                ఎన్ క్రాంతి కుమార్,  పి క్రాంతి కుమార్ ( స్వతంత్రులు)
19.హుజూర్ నగర్       శానంపూడి సైదిరెడ్డి (బీఆర్ఎస్)              తిమ్మారెడ్డి సైదిరెడ్డి ( స్వతంత్రులు)
20.  షాద్నగర్            వై అంజయ్య  (బీఆర్ఎస్)                     అంజయ్య ( స్వతంత్రులు)
21. కొల్లాపూర్            బీరం హర్షవర్ధన్ రెడ్డి  (బీఆర్ఎస్)         కీసరి హర్షవర్ధన్ రెడ్డి  స్వతంత్రులు)
22. రాజేంద్రనగర్     తోకల శ్రీనివాస్ రెడ్డి ( బిజెపి)            కే శ్రీనివాస్ రెడ్డి ( స్వతంత్రులు)
23.  దేవరకద్ర          ఆల వెంకటేశ్వర్ రెడ్డి  (బీఆర్ఎస్)        ఎం వెంకటేశ్వర్ రెడ్డి  ( స్వతంత్రులు),  గవిండ్ల మధుసూదన్ రెడ్డి,  బండ్ల మధుసూదన్ రెడ్డి ( ఆర్ యు పి పి)
24. గద్వాల               సరిత ( కాంగ్రెస్)                                జి సరిత ( నవరం కాంగ్రెస్ పార్టీ)         సరిత స్వతంత్ర)
 

click me!