కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి ఇంట్లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు...

Published : Nov 15, 2023, 08:53 AM IST
కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి ఇంట్లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు...

సారాంశం

కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఇంట్లో  భారీగా నగదు ఉందని తమకు సమాచారం అందిందని పోలీసులు చెబుతున్నారు. 

హైదరాబాద్ : ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు సోదాలు చేశారు. హయత్ నగర్ వినాయక్ నగర్ లో ఉన్న మధుయాష్కి తాత్కాలిక నివాసంలో మంగళవారం అర్ధరాత్రి ఎన్నికల ఫ్లైయింగ్ స్కాడ్, పోలీసులు సోదాలు నిర్వహించారు.  మధుయాష్కి  ఇంట్లో భారీ ఎత్తున నగదు నిల్వ చేసినట్లుగా.. డబ్బులు పంపిణీ చేస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడం వల్లే తనిఖీలకు వచ్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

దీనిమీద మధుయాష్కి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే సోదాల పేరుతో  పోలీసులు ఇంట్లోకి వచ్చారన్నారు. పోలీసులకు మధుయాష్కి అనుచరులకు కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మధుయాష్కి మండిపడ్డారు. సోదాల పేరుతో మధుయాష్కి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

పోలీసులు మాత్రం మధుయాష్కీ ఇంట్లో భారీగా నగదు ఉందని తమకు సమాచారం అందిందని చెబుతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?