తప్పుడు రిపోర్టులొద్దు, కిషన్ రెడ్డిని ప్రశాంతంగా ఉండనివ్వండి: నేతలకు బండి చురకలు

By narsimha lode  |  First Published Jul 21, 2023, 3:46 PM IST

పార్టీలో కొందరు నేతలనుద్దేశించి బండి సంజయ్ విమర్శలు  చేశారు.  తప్పుడు  సమాచారం పార్టీ అధిష్టానానికి ఇవ్వవద్దని చురకలంటించారు. 


హైదరాబాద్:  అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు  ఇవ్వవద్దని బండి సంజయ్  పార్టీలోని కొందరు  నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా  కిషన్ రెడ్డి శుక్రవారంనాడు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  నిర్వహించిన కార్యక్రమంలో  బండి సంజయ్ ప్రసంగించారు. పార్టీ సిద్దాంతాలను నమ్ముకుని చేరిన కార్యకర్తలు, నేతల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని  సంజయ్ కోరారు.

 పదే పదే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు  చేయవద్దని ఆయన  కోరారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా  పనిచేసిన  కిషన్ రెడ్డినైనా  ప్రశాంతంగా  పనిచేసుకోనివ్వాలని  బండి సంజయ్ కోరారు.  పార్టీ సిద్దాంతం కోసం  పనిచేసే నాయకుడు కిషన్ రెడ్డి ఆయన  కొనియాడారు.  కిషన్ రెడ్డి నాయకత్వంలో  నేతలందరం కలిసి పనిచేద్దామని  ఆయన  కోరారు.  దుబ్బాక, హుజూరాబాద్ లలో మనమంతా కలిసికట్టుగా పనిచేశామన్నారు. మునుగోడులో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారన్నారు. ప్రతి మండలానికి  మంత్రులు  ఇంచార్జీలుగా  పనిచేశారన్నారు.కానీ మంత్రులకు ధీటుగా  బీజేపీ కార్యకర్తలు  పనిచేశారని  బండి సంజయ్ గుర్తు  చేశారు.

Latest Videos

undefined

తెలంగాణలోరామ రాజ్యం రావడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆయన  కోరారు. పాతబస్తీ మీది కాదు, మాదీ     అని ఆయన పరోక్షంగా ఎంఐఎంనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ భాగ్యలక్ష్మి వేదికగా  గతంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి బండి సంజయ్ ప్రస్తావించారు.బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ద్వారా  కేసీఆర్ చెప్పిస్తున్నారని ఆయన విమర్శించారు.పీఆర్‌సీ  వేస్తున్నట్టుగా ప్రభుత్వం లీక్ లు ఇస్తుందన్నారు.పీఆర్‌సీ వేసినా ప్రభుత్వం అమలు చేయదని బండి సంజయ్ చెప్పారు. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను దారి మళ్లించారన్నారని ఆయన విమర్శించారు. కులవృత్తులను కేసీఆర్ నాశనం చేశారన్నారు.

బీసీలు  బీజేపీకి ఓట్లు వేస్తారనే భయంతో  రూ. 1 లక్ష ఆర్ధిక సహాయం ఇస్తామని  కేసీఆర్ కొత్త పథకం తీసుకువచ్చారన్నారు.
ఎన్నికలు వచ్చాయంటే నాటకాలు మొదలు పెడడం  కేసీఆర్ నైజమన్నారు. ప్రగతి భవన్ లో ధావతులు అంటూ గొప్పలు చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. 

also read:బీజేపీ తెలంగాణ శాఖకు కొత్త బాస్: అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి

 బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉండాలనే పద్దతి మారాలన్నారు.  పార్టీ ముఖ్యం, పార్టీ సిద్దాంతాలు, పార్టీ గుర్తు ముఖ్యమన్నారు. వీటిని గుర్తుంచుకోవాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.

 

click me!