ఇప్పట్లో స్కూల్స్ తెరవం, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు: సబితా ఇంద్రారెడ్డి

By narsimha lodeFirst Published Sep 15, 2020, 2:58 PM IST
Highlights

నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.


హైదరాబాద్: నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

మంగళవారం నాడు  తెలంగాణ అసెంబ్లీలో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ, పాఠశాలల పున:;ప్రారంభంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు.

కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 16 నుండి పాఠశాలలను మూసివేసినట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. లాక్ డౌన్ సమయంలో పరీక్షల నిర్వహణపై ఆందోళన నెలకొనడంతో అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతులకు విద్యార్థులను ప్రమోట్ చేశామని చెప్పారు.ఇప్పట్లో విద్యాసంస్థలను తెరవబోమని మంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థలు తెరిచేందుకు ఇంకా సమయం పడుతోందని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకే పాఠశాలలను తెరుస్తామన్నారు.విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు వీలుగా ఆన్ లైన్ క్లాసులకు రూపకల్పన చేశామన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామన్నారు.రాష్ట్రంలో మూడు రకాల సర్వేలు నిర్వహించినట్టుగా మంత్రి వివరించారు.

రాష్ట్రంలోని 85 శాతం మంది విద్యార్థుల నివాసాల్లో టీవీ ఉందని ఈ సర్వే తేల్చింది. 40 శాతం విద్యార్థుల ఇళ్లలలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. టీవీ, స్మార్ట్ ఫోన్లు లేని విద్యార్థులను ఇతర విద్యార్థులతో అనుసంధానం చేశామని మంత్రి వివరించారు. 

దూరదర్శన్, టీ శాట్ యాప్ లలో డిజిటల్ క్లాసులను విద్యార్థులకు పాఠాలను అందుబాటులో ఉంచినట్టుగా మంత్రి చెప్పారు.విద్యార్థుల కోసం 48 వేల వాట్సాప్ గ్రూపులు  ఏర్పాటు చేసి ఆన్ లైన్ లో విద్యాబోధన చేస్తున్నట్టుగా సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
 

click me!