హైదరాబాద్‌‌లో రూ.3.5 కోట్ల హవాలా సొమ్ము పట్టివేత

Siva Kodati |  
Published : Sep 15, 2020, 02:39 PM IST
హైదరాబాద్‌‌లో రూ.3.5 కోట్ల హవాలా సొమ్ము పట్టివేత

సారాంశం

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీగా హవాలా డబ్బు బయటపడింది. సుమారు రూ.3.5 కోట్లను పట్టుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ మంగళవారం మీడియాకు వివరాలు అందజేశారు

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీగా హవాలా డబ్బు బయటపడింది. సుమారు రూ.3.5 కోట్లను పట్టుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ మంగళవారం మీడియాకు వివరాలు అందజేశారు.

ఇందుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది... ఎవరెవరి చేతులు మారిందన్న అంశంపై ఆదాయపుపన్ను శాఖ అధికారుల దర్యాప్తు చేస్తారని సీపీ పేర్కొన్నారు.

పట్టుబడిన నిందితులను సైతం ఐటీ కస్టడీకి అప్పగిస్తామని అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆయన అభినందించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana