ఆధార్ వివరాలు అడగొద్దు: రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ సర్కార్‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published Dec 17, 2020, 5:00 PM IST
Highlights

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ఆధార్ వివరాలు అడగవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ఆధార్ వివరాలు అడగవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని హైకోర్టు ఆదేశం. pic.twitter.com/6EoD8CueES

— Asianetnews Telugu (@AsianetNewsTL)

గురువారం నాడు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయమై తెలంగాణ హైకోర్టు విచారించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్ లో ఉన్న ఆధఆర్ కాలం తొలగించేవరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

also read:రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించక తప్పదు: ధరణిపై హైకోర్టు వ్యాఖ్యలు

కులం, కుటుంబసభ్యుల వివరాలు కూడా తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను యధావిధిగా కొనసాగించేందుకు అభ్యంతరం లేదని తెలిపింది.సాఫ్ట్‌వేర్ లో ఆధార్ కాలం తొలగించే వరకు స్లాట్ బుకింగ్,  ఐపీఎన్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్ల కోసం ఇతర గుర్తింపు పత్రాలు అడగొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై విచారణను వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు కోర్టు వాయిదా వేసింది.

click me!