దేవరయంజాల్‌ భూముల నుండి ఎవరిని ఖాళీ చేయించొద్దు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Published : May 27, 2021, 03:19 PM IST
దేవరయంజాల్‌ భూముల నుండి ఎవరిని ఖాళీ చేయించొద్దు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సారాంశం

 దేవరయంజాల్ భూముల నుండి ఎవరినీ ఖాళీ చేయించవద్దని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

హైదరాబాద్: దేవరయంజాల్ భూముల నుండి ఎవరినీ ఖాళీ చేయించవద్దని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేవర యంజాల్ భూముల నుండి ఖాళీ చేయిస్తున్నారని దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించింది. ఈ స్థలాల్ని ఖాళీ చేయాలని లేకపోలే షెడ్లు కూల్చివేస్తామని ప్రభుత్వం చెబుతోందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ భూముల్లో షెడ్ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపంది. ఎవరిని కూడ ఈ భూముల నుండి ఖాళీ చేయించడం లేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. 

also read:ఈటలను ఎందుకు పార్టీలో కొనసాగిస్తున్నారు: కేసీఆర్‌కి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్న

దేవరయంజాల్ లోని శ్రీ సీతారామస్వమి ఆలయానికి చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆయన అనుచరులు ఈ భూములను ఆక్రమించుకొని నిర్మాణాలను చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి.ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఐఎఎస్ కమిటీ‌ విచారణ నిర్వహిస్తోంది. ఈ కమిటీ విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.  ఇదిలా ఉంటే ఈ భూముల్లో ఈటల రాజేందర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలకు కూడ భూములు ఉన్నాయని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 


 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్