2019 మే కరెంట్ బిల్లునే ఈ నెలలో చెల్లించండి: టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ

Published : May 11, 2020, 05:43 PM ISTUpdated : May 11, 2020, 05:51 PM IST
2019 మే  కరెంట్ బిల్లునే ఈ నెలలో చెల్లించండి: టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ

సారాంశం

2019 మే మాసంలో వచ్చిన బిల్లుల ఆధారంగా ఈ నెలలో కూడ విద్యుత్ బిల్లులు చెల్లించాలని  టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వినియోగదారులను కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీయని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

హైదరాబాద్: 2019 మే మాసంలో వచ్చిన బిల్లుల ఆధారంగా ఈ నెలలో కూడ విద్యుత్ బిల్లులు చెల్లించాలని  టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వినియోగదారులను కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీయని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ మాసంలో కూడ కరెంట్ రీడింగ్ తీయలేదు. దీంతో 2019 ఏప్రిల్ మాసంలో వచ్చిన బిల్లులను చెల్లించాలని టీఎస్ఎస్‌పీడీసీఎల్ కోరింది. దీంతో ఆన్ లైన్ లో వినియోగదారులు విద్యుత్ బిల్లులను చెల్లించారు. లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 నుండి మే 3 వ తేదీ వరకు పొడిగించారు,.  మే 3 వ తేదీ నుండి మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద వలస కార్మికుల ఆందోళన, ఉద్రిక్తత

దీంతో ఈ మాసంలో కూడ విద్యుత్ రీడింగ్ తీయడం కుదరలేదు.దీంతో మే మాసంలో విద్యుత్ బిల్లులను గత ఏడాది మే మాసంలో వచ్చిన బిల్లుల ఆధారంగా చెల్లించాలని సీఎండి రఘుమారెడ్డి కోరారు.

వచ్చే నెలలో ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ తీస్తామని ఆయన ప్రకటించారు. గత నెలలో 66 శాతం విద్యుత్ బిల్లులను చెల్లించారని ఆయన ప్రకటించారు. విద్యుత్ బిల్లులను చెల్లించకున్నా కూడ విద్యత్ కనెక్షన్లను కట్ చేయలేదని ఆయన గుర్తు చేశారు. 

విద్యుత్ బిల్లుల చెల్లింపుపై అనేక ఫిర్యాదులు అందినట్టుగా తెలిపారు. ఏప్రిల్, మే మాసాలకు సంబంధించిన బిల్లులను అడ్జెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu