హైద్రాబాద్ సుల్తాన్ బజార్ యూపీహెచ్‌సీలో డాక్టర్ వసంత్ నిరసన: రూమ్‌లో పెట్రోల్ బాటిల్‌తో ఆందోళన

By narsimha lode  |  First Published Dec 6, 2022, 12:31 PM IST

హైద్రాబాద్ సుల్తాన్ బజార్ యూపీహెచ్‌సీలో డాక్టర్ వసంత్ అర్ధరాత్రి నుండి నిరసనకు దిగారు. కరోనాకు మందు కనిపెట్టినా తనకు అధికారుల నుండి సహకరించలేదని రూమ్ లో గడియపెట్టుకుని దీక్షకు దిగారు.


హైదరాబాద్: హైద్రాబాద్ సుల్తాన్ బజార్ యూపీహెచ్‌సీలో డాక్టర్ వసంత్  అర్ధరాత్రి నుండి  నిరసనకు దిగాడు.. కరోనాకు మందు కనిపెట్టినా కూడా తనకు ఉన్నతాధికారులు సహకరించడం లేదని ఆయన  ఆందోళన చేస్తున్నారు. తన రూమ్ లోకి వెళ్లి పెట్రొల్ బాటిల్  పెట్టుకొని  బయటకు రాకుండా  నిరసన చేస్తున్నారు.  కరోనాకు మందు కనిపెట్టిన తనను ప్రోత్సహించాలని ఆయన  కోరుతున్నారు. వసంత్  గతంలో గాంధీ ఆసుపత్రిలో  సివిల్ సర్జన్ గా  పనిచేశారు. గాంధీ ఆసుపత్రి నుండి సుల్తాన్ బజార్ యూపీహెచ్‌సీలో  డాక్టర్ వసంత్ మెడికల్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు.  కరోనాకు తాను మందును తయారు చేసినట్టుగా  డాక్టర్ వసంత్ చెబుతున్నారు. ఐదు రోజుల్లో తాను తయారు చేసిన  మందుతో  కరోనాను నయం చేయవచ్చన్నారు. తాను తయారు చేసిన మందుకు కేవలం రూ. 45 మాత్రమేనని డాక్టర్ వసంత్ రామ్  తెలిపారు.

click me!