డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితుల కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదుగురు నిందితులను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితుల కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ నెల 9వ తేదీన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశారు. ఈ కేసులో ఏ 3 బాను ప్రకాష్, ఏ4 సాయినాథ్, ఏ 8 ప్రసాద,్ ఏ9 హరి, ఏ 30 విశ్వేశ్వర్ కస్టడీ కోరుతూ ఆదిభట్ట పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి సహా మరో ముగ్గురి కోసం పోలీసులు ఇంకా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే 32 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ వైశాలికి నిశ్చితార్ధం ఉందని తెలుసుకొని ఆమెను కిడ్నాప్ చేసేందుకు నవీన్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నవీన్ రెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నవీన్ రెడ్డి పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నించారని పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసేందుకు కొంత కాలంగా నవీన్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నవీన్ రెడ్డి మిస్టర్ టీ స్టాల్ ను నిర్వహిస్తున్నారు. మిస్టర్ టీ స్టాల్స్ కు చెందిన ప్రాంచైజీ నిర్వహిస్తున్న వారెవరైనా నవీన్ రెడ్డికి సహాయం చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగుళూరు, తమిళనాడు రాష్ట్రాల్లో నవీన్ రెడ్డి సంచరిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
also read:డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని నవీన్ రెడ్డి ప్లాన్: రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కోసం వారం రోజులుగా నవీన్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా కస్టడీ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. రుమాన్, చందూ, సిద్దూ, సాయినాథ్, భానుప్రకాష్ లతో డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేయాలని నవీన్ రెడ్డి ప్లాన్ చేశారని కస్టడీ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. పోలీసుల నుండి తప్పించుకొనేందుకు నవీన్ రెడ్డి పక్కా ప్లాన్ వేసుకున్నారు. తన స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులతో కూడా నవీన్ రెడ్డి టచ్ లోకి వెళ్లలేదు. ఎవరితోనైనా టచ్ లోకి వెళ్తే పోలీసులు గుర్తించే అవకాశం ఉందని నవీన్ రెడ్డి భావిస్తున్నాడు. నవీన్ రెడ్డి ఉపయోగించిన వోల్వో కారును శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో సోమవారంనాడు పోలీసులు గుర్తించారు.