నిఖిల్ రెడ్డి కేసు.. డాక్టర్ పై వేటు

First Published Nov 5, 2016, 1:50 AM IST
Highlights
  • ఆపరేషన్ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ లైసెన్స్ రద్దు 

ఎత్తు పెంచుతామని నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఆపరేషన్ చేసి అతడి అనారోగ్యానికి కారణమైన కేసులో డాక్టర్ పై చర్యలు తీసుకున్నారు. ఎత్తు పెరిగేందుకు నిఖిల్ రెడ్డికి అశాస్త్రీయ పద్దతిలో ఆపరేషన్ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ లైసెన్సు రెండేళ్ల పాటు రద్దు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇవాళ దీనిపై నిర్ణయం తీసుకుంది.

దాదాపు ఆరు నెలల కిందట గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్ రెడ్డి ఎత్తు పెరిగేందుకు సర్జరీ చేయించుకున్నాడు. కాగా సర్జరీ విజయవంతం కాకపోగా, ఆ తర్వాత అతను  నడవలేకపోయాడు. మంచానికే పరిమితమయ్యాడు. వైద్యుల నిర్వాకంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని, అతనికి పరిహారం చెల్లించాలని డిమాండ్లు వెల్లు వెత్తాయి. నిఖిల్ రెడ్డి కుటుంబసభ్యులు హెచ్‑ఆర్సీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూ కుడా ఫిర్యాదు చేశారు

click me!