
పౌరసరఫరా శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై వస్తున్న విమర్శలు, అవినీతి ఆరోపణలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ తీవ్రంగా స్పందించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు రిటైర్డ్ ఉద్యోగులపై వేటు వేశారు. అలాగే ఇకపై అవితీనికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని హెచ్చరించారు. అవితీనికి పాల్పడే వారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం పౌరసరఫరా శాఖలో ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరా శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ చర్చించారు. ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది ఉద్యోగుల పేర్లను ప్రస్తావిస్తూ.. ఎక్కడెక్కడ ఎవరెవరు అవితీకి పాల్పడుతున్నారనే అంశాలను పేర్కొంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ‘ఏం రోగం మీకు.. చేతులు చాచకుండా పనిచేయలేరా.. కార్పొరేషన్ మీకు జీతాలిస్తోంది కదా.. అయినా ఇదేం పని... అంటూ మండిపడ్డారు.