
రెండున్నర ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకు దీనంగా మారుతోందని, వ్యవసాయం చేయడమే కష్టంగా మారిందని అన్నారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
రైతాంగం సమస్యలపై టీడీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రైతాంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంపై ఒత్తడి తీసేకవచ్చేందుకు ఆదివారం నుంచి భూపాలపల్లి నుంచి రైతు పోరుయాత్ర పేరిట పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఏక మొత్తంలో రుణమాఫీ చెల్లించడంతో పాటు, జాప్యం ద్వారా రైతులపై పడ్డ వడ్డీ బారాన్ని పూర్తిగా చెల్లించాలి. ఆత్మహత్య చేసుకున్న 2,750 మంది రైతుల కుటుంబాలకు రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలనే తదితర డిమాండ్లతో యాత్ర చేపడుతున్నట్లు వివరించారు.