ప్రైవేట్ ఆసుపత్రి నుండి నిమ్స్ కు డాక్టర్ సుల్తానా తరలింపు: చర్యలకు ఈటల ఆదేశం

By narsimha lodeFirst Published Jul 5, 2020, 3:40 PM IST
Highlights

ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ డాక్టర్ సుల్తానాను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది

హైదరాబాద్: ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ డాక్టర్ సుల్తానాను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. డాక్టర్ సుల్తానా చేసిన ఆరోపణలపై విచారణ నిర్వహించి బాధ్యులుగా తేలితే చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.

కరోనా లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ డాక్టర్ సుల్తాన్ ఇవాళ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఒక్క రోజులోనే రూ. 1.50 లక్షలు బిల్లు వేసిందని ఆమె ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నిస్తే తనను  నిర్భంధించారని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.

also read:ఒక్క రోజుకే రూ.1.50 లక్షల బిల్లు: ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ నిర్భంధం,సెల్ఫీ వీడియో

ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. డాక్టర్ సుల్తానాను ప్రైవేట్ ఆసుపత్రి నుండి నిమ్స్ కు తరలించి చికిత్స అందించాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.ప్రైవేట్ ఆసుపత్రిపై విచారణ జరిపి తప్పులని తేలితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి.


ప్రైవేట్ ఆసుపత్రి వివరణ

ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ డాక్టర్ సుల్తానాను తాము నిర్భంధించలేదని ప్రైవేట్ ఆసుపత్రి ప్రతినిధి ఆదివారం నాడు మీడియాకు వివరించారు. తమ ఆసుపత్రిలో చికిత్స పొందిన డాక్టర్ సుల్తానా తమ సిబ్బందిని దూషించారని చెప్పారు. కానీ ఈ విషయమై తమ సిబ్బందికి సర్దిచెప్పినట్టుగా తెలిపారు.

డాక్టర్ సుల్తానా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వివరణ ఇచ్చారు. మీడియా ప్రతినిధులపై కూడ దాడి చేశారని కొందరు మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. 

click me!