నిమ్స్‌లో మనుషులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్: ఈ నెల 7 నుండి ప్రారంభం

By narsimha lodeFirst Published Jul 5, 2020, 1:39 PM IST
Highlights

కరోనా రోగులపై నిమ్స్ ఆసుపత్రిలో ఈ నె 7వ తేదీ నుండి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. హైద్రాబాద్ భారత్ బయోటెక్ సంస్థ, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్  కోవాక్సిన్ ను తయారు చేస్తోంది.


హైదరాబాద్: కరోనా రోగులపై నిమ్స్ ఆసుపత్రిలో ఈ నె 7వ తేదీ నుండి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. హైద్రాబాద్ భారత్ బయోటెక్ సంస్థ, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్  కోవాక్సిన్ ను తయారు చేస్తోంది.

కోవాక్సిన్  వ్యాక్సిన్ ను ఈ నెల 7వ  తేదీ నుండి నిమ్స్ లో రోగులపై ప్రయోగించనుంది.ఈ మేరకు డీసీజీఐ అనుమతి లభించింది. ఆగష్టు 15వ తేదీ నాటికి దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. 

కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ ను ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ తెలిపారు. దేశంలోని 12 సంస్థల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లో నిమ్స్ సంస్థను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. 

మూడు రకాల వ్యాక్సిన్ ను రెండు డోసుల చొప్పున కరోనా రోగులపై ప్రయోగించనున్నారు. ఈ వ్యాక్సిన్ లో కూడ 3 మైక్రోగ్రాములు ఒక రకమైన వ్యాక్సిన్, మరొకటి 6 మైక్రో గ్రాములు ఇస్తారు. రెండు దఫాలు  ఈ క్లినికల్ ట్రయల్స్  నిర్వహించనున్నారు. తొలి దఫా 28 రోజులు నిర్వహించనున్నారు. 

కరోనా వ్యాక్సిన్  తయారీలో ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించాయి. ఇండియాకు చెందిన సంస్థ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్సిన్  మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనుంది.

click me!