Huzurabad bypoll: ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల దంపతులు.. ఈరోజు కూడా డబ్బు పంచుతున్నారు.. ఈటల కామెంట్స్

Published : Oct 30, 2021, 10:09 AM IST
Huzurabad bypoll: ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల దంపతులు.. ఈరోజు కూడా డబ్బు పంచుతున్నారు.. ఈటల కామెంట్స్

సారాంశం

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కమలాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం 262లో ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమునా రెడ్డి ఓటు వేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కమలాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం 262లో ఈటల రాజేందర్ (Etela Rajender), ఆయన సతీమణి జమునా రెడ్డి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతుందన్నారు. హుజురాబాద్ ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఆరు నెలల సుదీర్ఘ ప్రచారం తర్వాత ఎన్నిక జరుగుతోందని తెలిపారు. 

‘హుజురాబాద్‌లో తీవ్రమైన అధికార దుర్వినియోగం జరిగింది. అధికార పార్టీకే ఓటు వేయాలని తీవ్రమైన ఒత్తిడిలు తీసుకొచ్చారు. హుజురాబాద్‌లో ఏం జరుగుతుందనేది ప్రతి చోట చర్చనీయాంశంగా మారింది.  పోలీసులే అధికార పార్టీకి సహకరించారు. ప్రజలు బయటకు వచ్చిన తమకు డబ్బులు ఇవ్వలేదని అన్నారంటే పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా ఓటర్లకు డబ్బులు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతుంది’అని ఈటల రాజేందర్ అన్నారు.

Also raed: Huzurabad bypoll: హుజురాబాద్ ఉప ఎన్నిక లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి..

ఇక, హుజురాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన  పోలింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు జరిగనుంది. ఇందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. హుజురాబాద్ నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులువ1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు..ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనాలు అనుసరించి నిర్వహించారు..నియోజకవర్గం లో  144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ కన్నల్ ఇప్పటికే తెలిపాడు..ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు,891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగించారు... మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగించారు..నిన్న సాయంత్రం లొగా పోలింగ్ సిబ్బంది తమకి కెటాయించిన సామాగ్రితో తమకి కెటాయించిన పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నారు..306 పోలింగ్ స్టేషన్ లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించారు..!

పోలింగ్ కేంద్రం నకి వచ్చే ప్రతి ఓటరు సానిటైజ్ చేసుకొనేలా ఏర్పాటు చేసారు..ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ వర్కర్స్ థర్మమీటర్ తో టెంపరేచర్ ని పరీక్షించి లోపలికి పంపుతారు..ఓటు హక్కు వినియోగించుకునే కోవిడ్ పేషెంట్ లకి ప్రత్యేక పిపిఈ కిట్లు,కుడి చెతికి గ్లౌజులు సిద్దం గా ఉంచారు..సోషల్ మిడియాలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మవద్దని ప్రజలు శాంతియుత వాతావరణం లో ఓటు హక్కు,స్వేచ్ఛా గా వినియోగించుకోవాలని కోరారు..3880 మంది పోలిసులతో పటిష్ఠమైన బందోభస్తుని ఏర్పాటు చేసారు..

ఈటెల అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం... ఆవెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం... ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు. ప్రధానంగా పోటీ ఈ మూడు పార్టీల మధ్యనే నెలకొన్నప్పటికీ... కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు విజేతను నిర్దేశించనున్నాయి..!

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్