విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన మహిళ.. కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురైనట్టు గుర్తించి ఆరా తీసింది. జరిగిన దారుణాన్ని తెలుసుకుని భర్తకు సమాచారమిచ్చింది.
వీర్నపల్లి : ఆరేళ్ల గిరిజన బాలిక మీద ఓ గ్రామ సర్పంచి భర్త, అధికార పార్టీ నేత లైంగిక దాడికి పాల్పడటం ఉద్రిక్తతకు దారి తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో శుక్రవారం ఘటన జరిగింది.
బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ Village Sarpanch ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆమె భర్త ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ రెండు రోజులకు ఒకసారి ఇంటికి వస్తుంటాడు.
undefined
వీరికి ఓ కుమార్తె (6), ఓ కుమారుడు, రెండో తరగతి చదువుతున్న బాలిక గురువారం బడికి వెళ్లలేదు. చిన్నారి తల్లి విధులకు వెళ్తూ బాలికను సర్పంచి ఇంట్లో వదిలివెళ్లారు. సర్పంచి భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో Chocolate ఆశ చూపి చిన్నారి మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని rape చేశాడు.
విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన మహిళ.. కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురైనట్టు గుర్తించి ఆరా తీసింది. జరిగిన దారుణాన్ని తెలుసుకుని భర్తకు సమాచారమిచ్చింది.
అనంతరం ఇద్దరూ ఈ విషయమై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని నిలదీశారు. ఆయన తప్పు అంగీకరించకపోగా, వారిని వాళ్ల ఇంట్లోనే బంధించి ఇంటికి lock వేశాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు శుక్రవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకుని తాళాలు పగులగొట్టి బాధితులను బయటకు తీసుకొచ్చారు.
పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి పారిపోయేందుకు యత్నించిన accused కారు మీద దాడి చేశారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ధర్నా, ఉద్రిక్తం..
బాధిత కుటుంబానికి మద్దతుగా భారీ సంఖ్యలో జనం Ellareddypetaలోని ప్రధాన రహదారిమీద బైఠాయించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. వీరికి స్వేరోస్, అఖిల భారత బంజారా సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి, లంబాడి ఐక్య వేదిక, భాజపా, కాంగ్రెస్ నాయకులు మద్ధతు తెలిపారు.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ చంద్రశేఖర్ ఆందోళనకారులతో చర్చించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
సంగారెడ్డిలో దారుణం...
భర్త మృతికి కారణమైన భార్యను, ఆమె ప్రియుడిని శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు మోమిన్ పేట్ సీఐ వెంకటేశం తెలిపారు. వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
మండలానికి చెందిన చిన్నమల్కు శివశంకర్ (30)కు సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. సంవత్సరం క్రితం ఆమె భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది.
ఆ సమయంలో సంగారెడ్డికి చెందిన జహంగీర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా Extramarital affairకి దారి తీసింది. ఇటీవల మళ్లీ ఆమె భర్త దగ్గరకు రావడంతో జహంగీర్ శివశంకర్ తో పరిచయం పెంచుకున్నాడు.
ఇద్దరూ కలిసి Alcohol తాగేవారు. ఇటీవల మళ్లీ శివశంకర్ భార్యను వేధిస్తుండటంతో ప్రియుడు, ఆమె కలిసి అతడిని అంతమొందించాలని పథకం పన్నారు. మాయమాటలతో జహంగీర్ అతడిని మంగళవారం మైతాప్ ఖాన్ గూడకు తీసుకునివెళ్లి మద్యం తాగించాడు.
తాగిన మైకంలో ఉన్న అతడిపై రాళ్లతో దాడి చేసి Murderకు ప్రయత్నించాడు. తీవ్రగాయాల పాలైన శివశంకర్ రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు.