తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమేణా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 97,751 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,436 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,91,170కి చేరింది
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమేణా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 97,751 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,436 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,91,170కి చేరింది. ఇవాళ కోవిడ్ వల్ల 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,378కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 3,614 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,016 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 94.85 శాతానికి చేరుకుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 7, భద్రాద్రి కొత్తగూడెం 89, జీహెచ్ఎంసీ 184, జగిత్యాల 32, జనగామ 17, జయశంకర్ భూపాలపల్లి 34, గద్వాల 24, కామారెడ్డి 0, కరీంనగర్ 67, ఖమ్మం 148, మహబూబ్‌నగర్ 39, ఆసిఫాబాద్ 7, మహబూబాబాద్ 49, మంచిర్యాల 39, మెదక్ 08, మేడ్చల్ మల్కాజిగిరి 71, ములుగు 27, నాగర్ కర్నూల్ 19, నల్గగొండ 118, నారాయణపేట 11, నిర్మల్ 6, నిజామాబాద్ 14, పెద్దపల్లి 44, సిరిసిల్ల 18, రంగారెడ్డి 78, సిద్దిపేట 42, సంగారెడ్డి 89, సూర్యాపేట 64, వికారాబాద్ 31, వనపర్తి 19, వరంగల్ రూరల్ 27, వరంగల్ అర్బన్ 54, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.
Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.06.06.2021 at 5.30pm) pic.twitter.com/SkvNvxGnYD