తెలంగాణకు చేరిన కరోనా టీకా: జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇవే..!!

By Siva KodatiFirst Published Jan 12, 2021, 10:11 PM IST
Highlights

ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. తొలి విడతలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. తొలి విడతలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ కు, ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు.  

తెలంగాణలో కూడా కరోనా వ్యాక్సినేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. మంత్రులు, కలెక్టర్లతో జరిగిన సమావేశంలో వ్యాక్సినేషన్‌పైనే ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. 

తాజాగా ఇవాళ హైదరాబాద్‌కు వ్యాక్సిన్ చేరుకుంది. స్పైస్ జెట్ స్పెషల్ ఫ్లైట్‌లో మూడున్నర లక్షల డోస్ వ్యాక్సిన్ హైదరాబాద్ కు చేరుకుంది. పూణే సీరం ఇన్స్‌టిట్యూట్ నుండి స్పైస్ జెట్ విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి ఈ వ్యాక్సిన్ చేరుకుంది.

ఎయిర్ పోర్ట్ నుండి భారీ భద్రత మధ్య వ్యాక్సిన్‌ను కంటైనర్లలో జీఎంఆర్జీ అధికారులు తరలించారు. 31 బాక్సుల్లో 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్‌ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆ బాక్సులను కోఠిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి చేర్చారు.

దీని కోసం వ్యాక్సిన్ నిల్వ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 44 క్యూబిక్ మీటర్ సామర్థ్యం కలిగిన ప్రత్యేక ఫ్రీజర్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో జనవరి 16న మొత్తం 139 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తారు. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 కేంద్రాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి.

 

click me!