ఆ ప్రాజెక్ట్‌లపై ఏపీ ఫిర్యాదు: తెలంగాణ సర్కార్‌కి కృష్ణా బోర్డు లేఖ

Siva Kodati |  
Published : Jan 12, 2021, 09:20 PM IST
ఆ ప్రాజెక్ట్‌లపై ఏపీ ఫిర్యాదు: తెలంగాణ సర్కార్‌కి కృష్ణా బోర్డు లేఖ

సారాంశం

తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫిర్యాదుతో ఈ లేఖ రాసినట్లు తెలిపింది. కృష్ణా నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది

తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫిర్యాదుతో ఈ లేఖ రాసినట్లు తెలిపింది. కృష్ణా నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తోందని ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది.

మొత్తం 8 ప్రాజెక్ట్‌లపై అభ్యంతరాలు లేవనెత్తింది ఏపీ. ఇక తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో 5 కొత్త ప్రాజెక్ట్‌లు, కడుతున్న 3 ప్రాజెక్ట్‌ల పేర్లను కేఆర్ఎంబీ ప్రస్తావించింది.

ప్రాజెక్ట్‌లకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని ఏపీ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన డీపీఆర్‌లను అందించాలని కేఆర్ఎంబీ తెలంగాణ సర్కార్‌ను కోరింది. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu