కూల్చివేతలపై కేేసు

Published : Oct 27, 2016, 07:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
కూల్చివేతలపై కేేసు

సారాంశం

సచివాలయం కూల్చివేతలపై కేసు కేసు దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు శుక్రవారం విచారణ

సచివాలయం భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్ధనంలో కేసు దాఖలైంది. ఈ కేసును కాంగ్రెస్ శాసనసభ్యుడు, సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి, ఎంఎల్ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసారు. గురువారం కేసు దాఖలు చేయగానే లంచ్ మోషన్ లో అత్యవసర వ్యవహారంగా విచారించాలన్న పిటీషనర్ల వాదనను న్యాయస్ధానం తోసి పుచ్చింది. అయితే, ఈ కేసును శుక్రవారం విచారణ చేయనున్నట్లు న్యాయమూర్తి చెప్పారు.

  వాస్తు పేరుతో ప్రస్తుత సచివాలయంలోని ఎనిమిది భవనాలను కూల్చేసి అదే స్ధానంలో వాస్తు శాస్త్రానికి అనుగుణంగా పక్కాగా కొత్త భవనాలను కట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగానే చాలా కాలంగా వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నాలుగు బ్లాకులను మాత్రమే కాకుండా ఏపి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మిగిలిన నాలుగు బ్లాకులను కూడా తీసుకుని కూల్చేయాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. అందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కూడా కెసిఆర్ కు సహకరిస్తున్నారు.

                                                                                                                                                                                       

 

  ఏపి ఆధీనంలో ఉన్న నాలుగు బ్లాకులను తెలంగాణాకు స్వాధీనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తీసుకున్న నిర్ణయంలో గవర్నర్ పాత్ర కూడా కీలకమే. ఒకవైపు కెసిఆర్ నిర్ణయం, మరోవైపు గవర్నర్ రాయబారంతో పాటు వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా కాదనలేని అనివార్యతల నడుమ ఏపి ప్రభుత్వ ఆధీనంలొ ఉన్న నాలుగు బ్లాకులను ఇచ్చేయటానికి చంద్రబాబు సిద్ధపడ్డారు.

 తన ఆధీనంలోని బ్లాకులను  స్వాధీనం చేయటానికి ఏపి ప్రభుత్వం నుండి సానుకూలత రాగానే తమ ఆధీనంలో ఉన్న నాలుగు బ్లాకుల్లో ఉన్న వివిధ కార్యాలయాలను యుద్ధ ప్రాతిపదికన కెసిఆర్ ఖాళీ చేయిస్తున్నారు. కార్యాలయాలు ఖాళీ చేయటానికి కెసిఆర్ పది రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఇందుకోసం ఎనిమిది మంది ఉన్నతాధికారులను కూడా నియమించారు.

  ఈ ప్రక్రియ వేగవంతంగా సాగుతుండగానే కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. వాస్తుపై ముఖ్యమంత్రికి ఉన్న వ్యక్తిగత నమ్మకంతో సచివాలయం భవనాలను మొత్తం కూలగొట్టాలని నిర్ణయించటం సరికాదన్నారు. సిఎంకున్న వాస్తు నమ్మకం వల్ల సచివాలయాన్న కూలగొట్టి మళ్ళీ కొత్తవి కట్టాలంటే కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వారు మండిపడుతున్నారు. ఎటుతిరిగీ ఏపి సచివాలయాన్ని ఖాళీ చేస్తున్నందున విశాలమైన అదనపు భవనాలు కూడా తెలంగాణా ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయని వారిద్దరు పేర్కొన్నారు.  ఇద్దరు నేతలు కూడా ఇదే అంశాలను తమ పిటీషన్ లో పొందుపరిచారు.

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?