దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్: రిటైర్డ్ జడ్జితో విచారణకు సుప్రీంకోర్టు మెుగ్గు

By Nagaraju penumalaFirst Published Dec 11, 2019, 4:24 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశపై రేప్, హత్య ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్ జడ్జితో విచారించేందుకు సుప్రీం కోర్టు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశపై రేప్, హత్య ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్ జడ్జితో విచారించేందుకు సుప్రీం కోర్టు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

దిశ పై రేప్, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దిశ హత్యాచార ఘటనలో నిందితులను కాల్చి చంపి ఎన్ కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారంటూ ప్రజాప్రయోజన వాజ్యంలో స్పష్టం చేశారు. 

దిశ నిందితులను కాల్చి చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ లు న్యాయ స్థానాలను కోరారు. పిల్ పై బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. 

జస్టిస్ ఫర్ దిశ: రేప్ లపై సర్వే, విస్తుపోయే విషయాలు వెల్లడి.

ఎన్ కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. ఢిల్లీలోనే ఉంటూ ఆయన ఈ కేసును దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందులో భాగంగా మాజీ జస్టిస్ పీవీరెడ్డిని సంప్రదించామని అయితే అందుకు ఆయన నిరాకరించారని తెలిపారు. 

దర్యాప్తుపై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ హైకోర్టులో కూడా కేసు విచారణ కొనసాగుతుందని బోబ్డే స్పష్టం చేశారు. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేశారు. 

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్... యువకుడు ఆత్మహత్య...

ఇకపోతే ఎన్ కౌంటర్ పై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేసే అంశంపై కూడా చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎన్ కౌంటర్ పై తాము పూర్తి అవగాహనతో ఉన్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్ కౌంటర్ ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహాత్గీ వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం దర్యాప్తుపై సూచనలు, సలహాలను తెలియజేయాలంటూ తెలంగాణ సర్కారుకు పలు సూచనలు చేసింది. 

దిశ కేసు: ఇద్దరు కాదు... ముగ్గురూ మైనర్లేనా..?...

click me!