హైదరాబాద్ శంషాబాద్‌లో పశువైద్యురాలు దిశపై జరిగిన అత్యాచారం, హత్య తర్వాత దేశంలో మహిళల భద్రతపై ప్రజల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తైతే మహిళపై జరిగిన ఘోరమైన ఘటనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులు: మమ్మల్ని కొట్టి రివాల్వర్ లాక్కొన్నారు

సోషల్ మీడియాలో మహిళల భద్రత, హక్కులపై జరుగుతున్న చర్చ అస్పష్టంగా ఉంది. ఈ క్రమంలో ప్రజలు మహిళపై నేరాలు, భద్రతపై ఏమనుకుంటున్నారు అన్న దానిపై ప్రముఖ సెర్చింజిన్ యూసీ బ్రౌజర్ నిర్వహించిన సర్వేలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ దారుణాలను అరికట్టాలంటే సమాజానికి అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మహిళలు ఆపదలో ఉన్నప్పుడు సమాచారం అందించేందుకు వినియోగించే వుమెన్ హెల్ప్‌లైన్ నెంబర్ కూడా సర్వేలో పాల్గొన్న చాలా మందికి తెలియదట. 1091 హెల్ప్‌లైన్ ఎంతమందికి తెలుసని యూసీ బ్రౌజర్ అడగ్గా 50 శాతం మంది తమకు తెలియదని సమాధానమిచ్చారు. 

ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 12,502 మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు ప్రధాన కారణం ఏంటని ప్రశ్నించగా.. మహిళలు పొట్టి దుస్తులు వేయడమే ఈ దారుణాలకు కారణమని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. వీరిలో 7,296 మంది వస్త్రధారణ నేరాలపై ఎటువంటి ప్రభావం చూపదని వెల్లడించారు.

Also Read:దిశ కేసు నిందితుల్లో... ఇద్దరు మైనర్లు..?

మహిళలపై అత్యాచారం చేసిన వారికి ఉరి శిక్షే సరైనదని 60 శాతం మంది అభిప్రాయపడగా.. మిగిలిన వారు సమాధానం దాట వేశారు. ఇలాంటి కేసుల్లో కఠినమైన శిక్షలు ఉండాలని కొందరు తేల్చిచెప్పగా.. మరికొందరు మహిళలు తమను తాము రక్షించుకునేలా మెళకువలు నేర్పించాలని కోరారు. అలాగే స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలో పురుషులకు అర్థమయ్యేలా చెప్పాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.