తను డాక్టర్.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో రెండో పెళ్లి..అంతలోనే...

By Rekulapally SaichandFirst Published Dec 11, 2019, 3:40 PM IST
Highlights

 తాను ఇక బతకడం వేస్ట్ అనుకుంది. ఆమె జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. వైద్యురాలుగా చాలా మంది ప్రాణాలు నిలిపింది. కానీ  ఏమి లాభం చివరిగా తన ప్రాణాన్నీ బలి చేసుకుంది. వైద్యురులుగా పది మందికి ధైర్యం చెప్పాల్సిన తను ధైర్యం కొల్పోయి ఆత్యహత్య చెసుకుంది.

 తాను ఇక బతకడం వేస్ట్ అనుకుంది. ఆమె జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. వైద్యురాలుగా చాలా మంది ప్రాణాలు నిలిపింది. కానీ  ఏమి లాభం చివరిగా తన ప్రాణాన్నీ బలి చేసుకుంది. వైద్యురులుగా పది మందికి ధైర్యం చెప్పాల్సిన తను ధైర్యం కొల్పోయి ఆత్యహత్య చెసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఓ వైద్యురాలు  తనవు చాలించింది. కళ్యాణ్‌నగర్‌కు చెందిన శ్రావణి  వైద్యురాలిగా పని చేస్తోంది. వ్యక్తిగత కారణాలతో భర్తతో విడిపోయి తల్లిదండ్రులతో ఉంటుంది. ఆమెకు ఆరెళ్ళ కూమారుడు కూడా ఉన్నాడు.

భర్తతో విడిపోయినప్పటి నుంచి ఆమె కొంత నిస్పృహలో ఉంది. అయితే తను పాత సంఘటనలు  వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని  తల్లిదండ్రుల సూచడంతొో  ఆమె ఇటీవల  శ్రీనివాస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది.  శ్రీనివాస్‌  చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌‌గా  పనిచేస్తున్నారు. ఉద్యోగం రీత్యా ఆయన తమిళనాడు వెళ్లగా శ్రావణి తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

అంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ మంగళవారం ఉదయం ఆమె బాత్‌రూమ్‌  కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్ రూమ్‌లోకి వెళ్ళి తిరిగి రాకపోవంతో ఆమె తల్లి తలుపులు  కొట్టి పిలువగా ఎలాంటి సమాధానం లేకపోవడంతో చూట్టూ పక్కల వారిని పిలిచారు. వారు తలుపులు విరగొట్టి  చూడగా శ్రావణి ఉరి వేసుకుని ఉంది. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఓ సూసైడ్‌నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.  " ఒంటరిగా మిగిలిన తనకు తల్లిదండ్రులు చేయూతను ఇచ్చారు. అనవసరంగా రెండో వివాహం చేసుకున్నాను. అతను నాతో ఎలా ఉంటాడో తెలియదు. జీవితంపై విరక్తి వస్తుంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావు ఎవరూ బాధ్యులు కాదు" అని లేఖలో పేర్కొంది. శ్రావణి ఆత్యహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!