డీజిల్ ధర తెలంగాణలోనే అత్యధికం....ఇక్కడ లీటర్ రూ.79.73, అక్కడ రూ.68.58 మాత్రమే

By Arun Kumar PFirst Published Sep 14, 2018, 6:07 PM IST
Highlights

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరల పెంపుకు రూపాయి పతనమే కారణమంటూ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ధరల పెంపుకు ఒక్క రూపాయి పతనమే కాదు...రాష్ట్రాల పన్నుల మోత కూడా కారణమవుతోందనేది సామాన్యుల వాదన. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు  ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండటమే ఇందుకు నిదర్శనమని వారు వాపోతున్నారు. ఇక దేశంలో లీటర్ డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికంగా రూ.79.73 ఉండగా, పెట్రోల్ మహారాష్ట్ర పర్బానీ జిల్లాలో అత్యధికంగా రూ. 90.45గా ఉంది. ఇదే డీజిల్ పోర్ట్ బ్లేయర్ లో లీటర్ రూ.68.58 కి లభిస్తుండగా, లీటర్ పెట్రోల్ అండమాన్ నికోబార్ లో రూ. 69.97 అతితక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. 

పెట్రోల్, డీజిల్ పై దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు విధించడం వల్ల ధరల వ్యత్యాసం కనిపిస్తోంది. పన్నులు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వీటి ధర తక్కువగా ఉండి సామాన్యుడు కాస్త ఊరటపొందగా, ఎక్కువగా పన్నులు విధించే రాష్ట్రాల్లో వీటి ధరలు ఎక్కువగా ఉండి సామాన్యుడి జేబులకు చిల్లులు పెడుతున్నాయి.  

మహారాష్ట్రలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా, డీజిల్ ధర తెలంగాణ లో అధికంగా ఉంది. పెట్రోల్ మహారాష్ట్ర ప్రభుత్వం రెండు శ్లాబుల్లో పన్నులు వసూలు చేయడంతో మిగతా ప్రాంతాల్లో పోలిస్తే ఇక్కడ అధికంగా ఉంది. ఇక డీజిల్ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం దీనికి 26.01 శాతం వ్యాట్ విధిస్తోంది. దీంతో లీటర్ డీజిల్ ధర అమాంతం పెరిగి రూ.79.73 లకు లభిస్తోంది. ఇదే డీజిల్ పక్క రాష్ట్రం ఏపీలో రూ. 78.81 కి లభిస్తోంది. 

 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్, డిజీల్ పై కేవలం 6 శాతం మాత్రమే వ్యాట్ విధిస్తున్నారు. అందువల్లే ఇక్కడ ఇంత తక్కువ ధరలకే ఇవి లభిస్తున్నాయి. అయితే దేశంలోని ఓ ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య ఏకంగా పెట్రోల్, డీజిల్ లపై ఏకంగా దాదాపు  10-20 రూపాయలు తేడా ఉండటం ఆందోళనకు కారణమవుతోంది. తమ రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకుని తక్కువ ధరలకే వీటిని అందించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. 

click me!