మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదాన్ని ఏడాదిన్నర కిందటే గుర్తించారా? మరెందుకు ఆపలేదు?

By SumaBala Bukka  |  First Published Dec 20, 2023, 8:27 AM IST

మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వెనుక అందరూ అంటున్నట్లుగానే నిర్లక్ష్యమే ఉందా? దీంట్లో సమస్యలు ఉన్నాయని యేడాదిన్నర కిందటే ఇంజనీర్లు గుర్తించారా? ఎల్అండ్ టీ ఎందుకు పనిచేయలేదు? నీటిపారుదల శాఖ పనుల పూర్తికి ఒత్తిడి ఎందుకు చేయలేదు?


మేడిగడ్డ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ  కుంగుబాటు తీవ్ర దుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. లక్షల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఇలాంటి నాసిరకం పనుల మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, మేడిగడ్డ బ్యారేజ్ గురించి సంవత్సరంన్నర క్రితమే ఇంజనీర్లు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. దీంతో  ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 2022లోనే ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర దెబ్బతిన్న పియర్స్ లో బుడగలు వచ్చినట్లుగా ఇంజనీర్లు గుర్తించారు. అయితే, ఈ విషయాన్ని మేడిగడ్డ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థకు లేఖలు రాసి, ఊరుకున్నారు.

ఇటీవల ఈ విషయం వెలుగు చూడడంతో అప్పుడే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదంటున్నారు నిపుణులు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకులోని 17, 19, 29 కింది భాగంలో బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఏర్పడిందని, దీనిని నివారించే దిశగా చర్యలు చేపట్టాలని… వీటివల్ల దిగువ భాగంలోనే సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ పక్కకు జరిగాయని ప్రాజెక్ట్ ఇంజనీర్లు 2022 లోనే గుర్తించారు. ఈ మేరకు ఎల్ అండ్ టికీ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు లేఖ రాశారు. 

Latest Videos

తెలంగాణ సీఎం రేవంత్ విందులో ఆంధ్రా ఎంపీలు ...

లేఖ రాసే సమయానికి డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ లోనే ఉంది. అయితే, ఈ లేఖలకు ఎల్ అండ్ టీ స్పందించలేదు. 2023 ఏప్రిల్ లో కూడా పెండింగ్ లేదా పునరుద్ధరణ పనులుగా పేర్కొన్న వాటిలో కూడా సంబంధిత ఇంజనీర్లు ఈ విషయాన్ని గుర్తు చేశారు. బ్యారేజ్ కింది భాగంలోని సీసీ బ్లాక్ లో, లాంచింగ్, రాఫ్ట్ కు నష్టం జరిగినట్లుగా తెలిపారు. అంతేకాదు ఎప్పటికప్పుడు ఈ పెండింగ్ పనుల గురించి తెలిపినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది.

మేడిగడ్డ బ్యారేజ్ నిర్వహణ సంస్థ ఎల్అండ్ టీ అప్పుడే కనక స్పందించి ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదని అంటున్నారు. అయితే, ఇక్కడ మరో ప్రశ్న అనుమానాలను రేకెత్తిస్తుంది.. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిన ఇంజనీర్లు.. అంతకుముందే పని పూర్తయిపోయినట్లుగా సర్టిఫికెట్ ఇచ్చారు. అదెలా ఇచ్చారని  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం పని పూర్తి చేసిన తరువాతి రెండేళ్లు డిఎల్పి  ఉంటుంది.  దీంతోనే ప్రాజెక్టు సీనియర్ ఇంజనీర్లు లేఖలు రాసి చేతులు దులిపేసుకున్నారు తప్ప… ఎందుకు సీరియస్ గా తీసుకోలేదనేది  ప్రశ్నార్థకంగా మారింది.

మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులకు ఇటీవల ఎల్ అండ్ టీ సంస్థ నిరాకరించింది.  తమ ఒప్పంద పీరియడ్ ముగిసిందని.. ఇప్పుడు దీనికోసం మరో అనుబంధ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.. అయితే.. ఎల్ అండ్ టీతో చేసుకున్న ఒప్పందాల విషయంలో నీటిపారుదల శాఖ నుంచి కూడా స్పష్టత లేదు. దీనికి మేడిగడ్డ బ్యారేజీ పనులతో పాటు…దాని అనుబంధ పనులను కూడా ఈ గుత్తేదారు సంస్థకే ముందు ఆప్పగించారు.

ఇవి అప్పగించిన ఐదేళ్ల తర్వాత అతిధి గృహం, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణ పనులను కూడా ఆ సంస్థకే ఇచ్చారు. ఇవి అనుబంధంగా ఇచ్చినట్లు పరిగణించారు. అయితే, 2016లో ఒప్పందం చేసుకున్న పని ఎప్పటికి పూర్తయింది. రెండేళ్ల డిఫెక్ట్ లైబులిటీ పీరియడ్ ఎప్పటికీ పూర్తయింది... అన్న విషయాలపై స్పష్టత లేకపోవడంతో నీటిపారుదల శాఖపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

click me!