ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్: ఏ5గా శ్రీనివాస్ భార్య పేరు

Published : Aug 20, 2021, 05:54 PM IST
ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్: ఏ5గా శ్రీనివాస్ భార్య పేరు

సారాంశం

ఉమ్మడి మెదక్ జిల్లాలో రియల్ ఏస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసులో ఏ5 గా శ్రీనివాస్ భార్య  పేరును పోలీసులు చేర్చారు. ఈ కేసులో నిందితుడు శివతో శ్రీనివాస్ భార్య ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో రియల్ ఏస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ హత్య కేసులో  శ్రీనివాస్ భార్య పేరును  పోలీసులు చేర్చారు.ఎఫ్ఐఆర్‌లో ఏ5గా  శ్రీనివాస్ భార్య పేరును పోలీసులు చేర్చారు.

also read:ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు: భార్యపై పోలీసుల అనుమానం

ధర్మకార్ శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడు శివతో  శ్రీనివాస్ భార్య ఫోన్‌లో మాట్లాడినట్టుగా  పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. హత్యకు ముందు రోజు శివతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఆమె పేరును కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

మెదక్ జిల్లా వెల్తుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో ధర్మకార్ శ్రీనివాస్ కారు దగ్ధమైంది. కారు డిక్కీలో శ్రీనివాస్ డెడ్ బాడీ లభ్యమైంది.ఈ డెడ్‌బాడీ అప్పటికే పూర్తిగా కాలిపోయి ఉంది. అయితే డెడ్ బాడీ వద్ద దొరికిన కృత్రిమ దంతాల ఆధారంగా ఆ మృతదేహం శ్రీనివాస్‌దేనని పోలీసులు నిర్ధారించారు.

తన భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని శ్రీనివాస్ భార్య గతంలో పోలీసుల విచారణలో తెలిపింది.  ఈ కారణంగానే తనతో ఆయన తరచూ గొడవ పెట్టుకొనేవాడని ఆమె పోలీసుల విచారణలో తెలిపింది. 


 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!