నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

By pratap reddyFirst Published Sep 13, 2018, 11:01 PM IST
Highlights

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా 16 మంది తెలుగుదేశం పార్టీ నేతలపై ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

హైదరాబాద్: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా 16 మంది తెలుగుదేశం పార్టీ నేతలపై ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. వారిలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు, నాయకులు, తెలంగాణ నాయకులు ఉన్నారు. వారిని తమ ముందు హాజరు పరచాలని ఆదేశిస్తూ ధర్మాబాద్ పోలీసు ఇన్ స్పెక్టర్ కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

నాన్ బెయిలబుల్ వారంట్లు అందుకున్న నేతలు వీరే...

1. నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
2. జి. కమలాకర్ (కరీంనగర్)
3. కెఎస్ఎన్ఎస్ రాజు (ఆంధ్రప్రదేశ్)
4. సిహెచ్ ప్రభాకర్ (దొంగ్లాపూర్ నివాసి)
5. ఎన్ నాగేశ్వర్ మల్లేశ్వర్ (ఖమ్మం), నామా నాగేశ్వర రావు అయి ఉంటారు
6. జి. రామనాయుడు (జె.బి. నాయుడు), మదవెల్ల (తెలంగాణ రాష్ట్రం)
7. డి. ఉమామహేశ్వర రావు (మరిల్లవరం నివాసి)
8. సిహెచ్. విజయరామారావు (పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం)
9. ముజఫరొద్దీన్ అన్వరొద్దీన్ (మల్లాపేట్, హైదరాబాద్ జిల్లా, ఎపి రాష్ట్రం
10. హనుమంత్ షిండే మడప్ప (జుక్కల్, నిజామాబాద్ జిల్లా)
11. పి. అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్ (హిందూపూర్, అనంతపురం జిల్లా)
12. ఎస్. సోమ్ జోజు (అరకువ్యాలీ)
13. ఎఎస్ రత్నం (సాయన్న) (రంగారెడ్డి జిల్లా)
14. పి. సత్యనారాయణ సిందు (సత్యపాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం)
15. టి. ప్రకాశ్ గౌడ్ గొండయ్య (రాజేంద్రం)
16. ఎన్. ఆనందబాబు నాగేంద్రం (చిత్తూరు)

ఆ పేర్లతో కోర్టు పేర్కొన్నవారు వీరే...

నారా చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, టి .ప్రకాష్ గౌడ్, నక్కా ఆనంద బాబు,  గంగుల కమలాకర్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు, జి.రామానాయుడు, సి.హెచ్.విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్. సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింభు

ఈ వార్తాకథనాలు చదవండి

శ్రీవారి సేవలో ఉండగా చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

click me!