శ్రావణి కేసు.. పోలీసుల కస్టడీకి దేవరాజ్, సాయి కృష్ణ

Published : Sep 26, 2020, 11:48 AM IST
శ్రావణి కేసు.. పోలీసుల కస్టడీకి దేవరాజ్, సాయి కృష్ణ

సారాంశం

ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్‌మెయిల్‌ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.   

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది.  శ్రావణి ఆత్మహత్యకు కారకులుగా భావిస్తూ.. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వారిలో ఇద్దరు నిందితులు దేవరాజ్, సాయి కృష్ణలను ఇటీవల చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా.. ప్రస్తుతం ఆ ఇద్దరినీ మళ్ళీ మూడు రోజులపాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 

ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్‌మెయిల్‌ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. 

న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న దేవరాజ్‌, సాయిలను తిరిగి పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించి శ్రావణి ఆత్మహత్యకు గల మరిన్ని కారణాలు తెలుసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. ముగ్గురు నిందితుల సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు.  అయితే ఈ కేసులో మూడో నిందితుడు అయిన అశోక్‌ రెడ్డిని మాత్రం పోలీసులు ఇంకా కస్టడీకి తీసుకోలేదు.

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu