8435.83 లీటర్ల మద్యం, 8283.74 లీటర్ల బీర్ నేలపాలు

By Arun Kumar PFirst Published Aug 22, 2018, 11:33 AM IST
Highlights

అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ శాఖ వంద రోజుల ప్రత్యక్ష కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీంట్లో బాగంగా అధికారులు జరిపిన దాడుల్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. అయితే ఇలా జప్తు చేసిన మద్యం సీసాలను ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ధ్వంసం చేశారు.

తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు వివిధ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన దాడుల్లో అక్రమంగా విక్రయిస్తున్న 8435.83 లీటర్ల మద్యం(ఐఎంఎఫ్ఎల్), 8283.74 లీటర్ల బీరు పట్టుబడ్డాయి. దీంతో వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అయితే గత కొన్ని రోజులుగా వీటి నిల్వ పేరుకుపోతుండటంతో ఎక్సైజ్ ఆండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు మంగళవారం ద్వంసం చేశారు. ఎక్సైజ్ ఆండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగిందనడానికి ఈ కార్యక్రమం మంచి ఉదాహరణ అని ఆ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. అక్రమ మద్యం అమ్మకాలను రూపుమాపడమే కాదు ఇలా ఆ మద్యాన్ని ధ్వంసం చేసి తమ నిజాయితీని చాటుకున్నట్లు అకున్ తెలిపారు. 

ఈ వందరోజుల యాక్షన్ ప్లాన్ ఇక ముందు కూడా కొనసాగుతుందని నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్మకాలను చేపట్టే వారిపై కఠిన శిక్షలుంటాయని అకున్  హెచ్చరించారు. 

click me!