టీఆర్ఎస్ ఎంపీ కవితను కలిసిన కియరన్ డ్రేక్

By ramya neerukondaFirst Published Aug 22, 2018, 10:28 AM IST
Highlights

 కవిత వారికి కాకతీయ తోరణం, సిద్దిపేట ప్రాంతానికి చెందిన గొల్ల భామ చీరలు, భారత దేశ కోహినూర్ వజ్రం - తెలంగాణ అనే పుస్తకాన్ని బహూకరించారు.

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ను న్యూ ఢిల్లీ లోని బ్రిటీష్ హై కమిషన్ రాజకీయ,మీడియా విభాగాధిపతి కియరన్ డ్రేక్,    డిప్యూటీ హై కమిషనర్ (తెలంగాణ, ఏపీ) ఆండ్రూ ఫ్లేమింగ్,  రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్ లు హైదరాబాద్ లోని ఎంపి నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా ఎంపి కవిత వారికి కాకతీయ తోరణం, సిద్దిపేట ప్రాంతానికి చెందిన గొల్ల భామ చీరలు, భారత దేశ కోహినూర్ వజ్రం - తెలంగాణ అనే పుస్తకాన్ని బహూకరించారు. అనంతరం తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎంపి కవిత వారికి వివరించారు. చైతన్యవంతమైన సమాజం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని వివరించారు.

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో తాను చేసిన పనులను చెప్పారు. దశాబ్దాల కల అయిన రైలు సౌకర్యం కల్పించానని, పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలను ఎంపి కవిత వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించామని, తద్వారా  ప్రజలకు ఆర్థికపరమైన భారం తప్పిందన్నారు. నిజామాబాద్ జిల్లా ను అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపేందుకు  ఎంపి కవిత చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు.

click me!