దుబ్బాకలో స్వామిజీ రాసలీలలు: వివాహిత ఫిర్యాదుతో గుట్టు రట్టు

By telugu teamFirst Published Jul 11, 2020, 12:57 PM IST
Highlights

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక పోలీసు స్టేషన్ పరిధిలో ఓ స్వామీజీ, అతని అనుచరుడు ఓ మహిళపై కొన్నాళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చారు. మహిళ ఫిర్యాదుతో వారి గుట్టు రట్టయింది.

సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో ఓ స్వామీజీ రాసలీలల గుట్టు రట్టయింది. అతనితో పాటు అతని అనుచరుడి రాసలీలల బాగోతం ఓ మహిళ ఫిర్యాదుతో బయటపడింది. తనకు జరిగిన అన్యాయంపై మహిళ దుబ్బాక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేిసంది. ఇందుకు సంబంధించిన వివరాలను దుబ్బాక సీఐ హరికృష్ణ వెల్లడించారు. 

సిద్ధిపేట జిల్లా చీకోడుకు చెందిన ఓ మహిళ సంతోషిమాత భక్తురాలు. ఆమెకు సంతోషిమాత గుడి నిర్మించాలనే కోరిక కలిగింది. ఈ స్థితిలో చీకోడు గ్రామ సమీపంలో కొన్నేళ్లుగా రఘు అనే వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తి స్వామి సమర్థ మహరాజ్ అనే పేరుతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన వద్దుకు పెద్ద యెత్తున భక్తులు వస్తుంటారు. చీకోడ్ గ్రామానికి చెందిన మహిళ కూడా అతని భక్తురాలిగా మారింది. 

సంతోషిమాతకు గుడి కట్టాలనే తన కోరికను మహిళ స్వామీజీకి చెప్పింది. ఆణె అమాయకత్వాన్ని గుర్తించిన స్వామీజీ రాత్రి వేళలో తన అనుచరుడు నేర,్ ద్వారా ఫోన్ కాల్ చేయించి మాయమాటలు చెప్పాడు. "నీ సంకల్పం నెరవేరడానికి నా అనుచరుడు నరేష్ రూపంలో మీ ఇంటికి వస్తాను, ఆయన రూపంలో ఉన్న నన్ను సంతృప్తి పరిస్తే నీ సంకల్పం నెరవేరుతుందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దు" అని ఆమెకు చెప్పి ఒట్టు కూడా వేయించుకున్నాడు. 

దాంతో మహిళ వారికి లొంగిపోయింది. ఆ పేరుతో స్వామీజీ, నరేష్ కొంత కాలంగా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చారు. రోజులు గడుస్తున్నా తన సంకల్పం నెరవేరకపోవడంతో తనను మోసం చేశారని మహిళ గుర్తించింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో స్వామీజీని, అతని అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. నరేష్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. స్వామీజీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

click me!