ఫేస్ బుక్ ఫ్రెండ్ నుంచి వాట్సాప్ లో మెసేజ్ రాగానే...

By telugu news teamFirst Published Jul 11, 2020, 9:24 AM IST
Highlights

తన ఫేస్ బుక్ ఫ్రెండ్ ఆంథోనీ వాళ్ల బామ్మకి ఆరోగ్యం సరిగాలేదని.. అతని ట్రీట్మెంట్ కి డబ్బులు కావాలి అనేది ఆ మెసేజ్ సారాంశం.

ట్రీట్మెంట్ కి డబ్బులు అవసరమంటూ ప్రకటన చూడగానే నిజమని నమ్మి రూ.85వేలు ఇచ్చింది. తీరా డబ్బులు చెల్లించిన తర్వాత కానీ.. ఆమెకు తాను మోసపోయాననే విషయం తెలియలేదు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజాంపేటకు చెందిన ఓ మహిళ దారుణంగా మోసపోయింది. ఇటీవల ఆమెకు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. తన ఫేస్ బుక్ ఫ్రెండ్ ఆంథోనీ వాళ్ల బామ్మకి ఆరోగ్యం సరిగాలేదని.. అతని ట్రీట్మెంట్ కి డబ్బులు కావాలి అనేది ఆ మెసేజ్ సారాంశం.


తన బామ్మకి ఆరోగ్యం సరిగా లేదని.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. డబ్బులు అవసరమని ఆమెకు మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసి ఆమె నిజమని నమ్మింది. నిజంగా అతను చెప్పిన వివరాలతో ఢిల్లీలో ఎవరైనా చికిత్స పొందుతున్నారో లేదో కూడా ఆరా తీసింది. నిజమేనని తేలడంతో.. వెంటనే రూ.85వేలు చెప్పిన బ్యాంక్ ఎకౌంట్ కి ట్రాన్స్ ఫర్ ఛేసింది.

అయితే.. సదరు వ్యక్తి ఆమెను చాలా తెలివిగా మోసం చేసినట్లు తర్వాత తెలిసింది. ముందుగానే ఆమెకు సంబంధించిన వివరాలను సేకరించి... ఫేస్ బుక్ లో ఫేక్ ఎకౌంట్స్ క్రియేట్ చేసి మరీ మోసం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. కాగా.. సదరు మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
 

click me!