అమానవీయం: స్మశానంలోనే ముగ్గురు కరోనా రోగుల హోం ఐసోలేషన్

By narsimha lodeFirst Published Jul 31, 2020, 11:32 AM IST
Highlights

కరోనా వచ్చిన తర్వాత మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కరోనా సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకొంటున్నాయి.  ఇదే తరహా ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది.
 

సంగారెడ్డి: కరోనా వచ్చిన తర్వాత మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కరోనా సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకొంటున్నాయి.  ఇదే తరహా ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది.

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్  నియోజకవర్గంలో కరోనా సోకిన బాధితులను  గ్రామంలో ఉండేందుకు గ్రామ పెద్దలు నిరాకరించారు. దీంతో ముగ్గురు బాధితులు స్మశాన వాటికలోనే ఉంటున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ స్మశాన వాటికలోని  ఓపెన్ షెడ్డులోనే ఉంటున్నారు.

నారాయణఖేడ్  నియోజకవర్గంలోని ఖానాపూర్ తండాలో ఈ ఘటన చోటు చేసుకొంది. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్వంత గ్రామం కూడ ఇదే కావడం గమనార్హం. కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. వీరిని హోం ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే గ్రామంలో కరోనా సోకిన వారు నివాసం ఉంటే మిగతా వాళ్లకు కూడ కరోనా వ్యాపించే  అవకాశం ఉందని భావించారు. 

also read:కరోనా మరణాల్లో ఐదో స్థానంలో ఇండియా: 16 లక్షలు దాటిన కేసులు

కరోనా రోగులు ముగ్గురిని స్మశానంలో ఉండాలని చెప్పారు. దీంతో  ఈ ముగ్గురు స్మశానంలోనే ఉంటున్నారు. స్మశానంలోని ఓపెన్ షెడ్డులో ఇద్దరు పురుషులు ఉంటున్నారు. ఇక్కడి బాత్ రూమ్ లో మహిళ ఉంటుంది.

తమ వారిని గ్రామంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కరోనా రోగుల  కుటుంబసభ్యులు గ్రామ పెద్దలను కోరుతున్నారు. 


 

click me!