శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత: 11 మందిపై కేసు

By narsimha lodeFirst Published Jul 31, 2020, 10:56 AM IST
Highlights

వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రయాణీకుల నుండి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకొన్నారు.


హైదరాబాద్: వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రయాణీకుల నుండి కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకొన్నారు.

కరోనా నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను  కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం కింద విడతల వారీగా ఇండియన్లను విదేశాల నుండి తీసుకొస్తున్నారు.

ఈ మిషన్ కింద విదేశాల నుండి వచ్చిన 11 మంది ప్రయాణీకుల నుండి 3.11 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.ప్యాంట్ లోపలివైపు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యాకెట్లలో ఈ బంగారాన్ని దాచారు. ఈ బంగారం విలువ రూ.1.66 కోట్లు ఉంటుందని కస్షమ్స్ అధికారులు ప్రకటించారు.

also read:జయలలిత ఇంట్లో 4 కిలోల 372 గ్రాముల బంగారం: తమిళనాడు సర్కార్

అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చిన 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో కూడ ఇదే ఎయిర్ పోర్టులో సుమారు 1 కోటి రూపాయాల విలువైన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.

ఈ విషయమై కస్టమ్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బంగారాన్ని ప్రయాణీకులు ఎందుకు తీసుకొచ్చారనే విషయమై ఆరా తీస్తున్నారు. ప్యాంట్ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్యాకెట్లను బంగారం రవానా చేసేందుకే తయారు చేయించినట్టుగా గుర్తించారు. ఇంకా ఈ రకంగా గతంలో ఏమైనా బంగారం తరలించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

click me!