ఢిల్లీ లిక్కర్ స్కాం: ఆరు గంటలకు పైగా బిల్డర్ శ్రీనివాసరావు విచారణ

Published : Sep 19, 2022, 10:46 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం: ఆరు గంటలకు పైగా బిల్డర్ శ్రీనివాసరావు విచారణ

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిల్డర్ శ్రీనివాసరావును ఆరు గంటలకు పైగా ఈడీ అధికాారులు విచారించారు. లిక్కర్ స్కాం విషయంలో శ్రీనివాసరావుకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని ఆయన పరిశీలించారు. 

హైదరాబాద్ : బిల్డర్ శ్రీనివాసరావును సుమారు ఆరు గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు. సోమవారం నాడు రాత్రి పది గంటల తర్వాత ఈడీ అధికారులు  శ్రీనివాసరావు విచారణను ముగించారు. ఇవాళ ఉదయం నుండి  ఈడీ అధికారులు హైద్రాబాద్ తో పాటు కరీంనగర్ లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.  శ్రీనివాసరావుకు అరుణ్ రామచంద్రన్ పిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ రావుకు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీశారు

. అరుణ్ రామచంద్రన్ పిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ రావుతో కలిసి  శ్రీనివాసరావు నిర్వహించారని ఈడీ అధికారులు గుర్తించారు. ఢిల్లీకి విమానాల టికెట్లను శ్రీనివాసరావు సంస్థ ద్వారా బుక్ చేసిన విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. లిక్కర్ స్కాంలో శ్రీనివాసరావు పాత్ర ఏమైనా ఉందా అనే విషయమై కూడా ఈడీ అధికారులు ఆరా తీశారని ఆ కథనం తెలిపింది.రేపు కూడ విచారణకు రావాలని శ్రీనివాసరావును ఈడీ అధికారులు సూచించారని సమాచారం.

ఈ ఏడాది ఆగస్టు 19వ  తేదీన ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైద్రాబద్ కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లైపై కేసు నమోదైంది.  ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఈడీ అధికారులు ఈ నెల 16న సోదాలు చేశారు. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 40 చోట్ల సోదాలు చేశారు. మరో వైపు 12 మందితో పాటు 18 కంపెనీలకు కూడా ఈడీ అధికారులు నోటీసులిచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?