బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు: ఈనెల 22న పెద్ద అంబర్ పేటలో బీజేపీ సభ

By narsimha lode  |  First Published Sep 19, 2022, 8:14 PM IST


బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర  ఈ నెల 22న ముగియనుంది. యాత్ర ముగింపును పురస్కరించుకొని నిర్వహించే సభకు కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి హజారు కానున్నారు. ఈ సభ ఏర్పాట్లపై బండి సంజయ్ పార్టీ నేతలతో ఇవాళ చర్చించారు. 



హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 22న ముగియనుంది. యాత్ర ముగింపును పురస్కరించుకొని పెద్ద అంబర్ పేటలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.  ఈ నెల 12వ తేదీన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని పెద్ద అంబర్ పేటలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేసే విషయమై బీజేపీ నేతలతో బండి సంజయ్ సోమవారం నాడు చర్చించారు. 

Latest Videos

undefined

 ప్రజా గోస – బీజేపీ భరోసా, బస్తీ సంపర్క్ అభియాన్, సేవాపక్షం, పార్లమెంట్ ప్రవాసీ యోజన కార్యక్రమాల పురోగతిపై  కూడ  బీజేపీ నేతలు సమీక్షించారు.  ‘సేవా పక్షం’ పేరుతో  సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కూడ పార్టీ నేతలను కోరారు..

 టీఆర్ఎస్  ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. పెద్ద అంబర్ పేటలో నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర గ్రామీణాభివ్రుద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బండి సంజయ్ చెప్పారు. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సక్సెస్ చేద్దామని బండి సంజయ్ కోరారు. . ఇటీవల కాలంలోనే పాదయాత్ర పేరిట దాదాపు 13 బహిరంగ సభలు నిర్వహించి విజయవంతం చేశామన్నారు.  

ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన లభిస్తోందని బండి సజయ్ చెప్పారు. . మన పాదయాత్ర స్పూర్తితో దేశవ్యాప్తంగా పాదయాత్రలు  చేస్తున్నారన్నారు. . మీరంతా కష్టపడి పనిచేస్తే  రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు.   కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరుగుతుందని బండి సంజయ్ చెప్పారు. 

వీటితోపాటు జాతీయ నాయకత్వం నిర్ణయించిన ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’, దళిత సంపర్క్ అభియాన్, సేవాపక్షం వంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. దీంతోపాటు ప్రతి బీజేపీ కార్యకర్త తమ తమ నివాసాలపై కమలం పువ్వు గుర్తు ఉండేలా చర్య తీసుకోవాలన్నారు.

సగటున ప్రతి పోలింగ్ బూత్  పరిధిలో కనీసం 5 చోట్ల కమలం పువ్వు గుర్తుతో వాల్ పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈనెల 25లోపు పోలింగ్ బూత్ కు సంబంధించి పూర్తిస్థాయి కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.  పెద్ద అంబర్ పేట బహిరంగ సభ మునుగోడు ఉప ఎన్నిక పై ప్రభావం చూపడంతో పాటు బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.  

ఈసమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ జి.విజయరామారావు,  డాక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

click me!