అరెస్ట్ భయంతోనే కవితపేరు: అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పై కోర్టులో లాయర్

By narsimha lode  |  First Published Jun 2, 2023, 1:40 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన  అరుణ్ రామచంద్ర పిళ్లై  బెయిల్ పై  ఇవాళ కోర్టులో కీలక వాదనలు  జరిగాయి.  ఈ నెల  8న బెయిల్ పై  కోర్టు తీర్పును వెల్లడించనుంది. 


న్యూఢిల్లీ: అరెస్ట్ భయంతోనే  అరుణ్ రామచంద్రపిళ్లై  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పేరును  చెప్పారని  పిళ్లై తరపు న్యాయవాది  కోర్టుకు తెలిపారు.శుక్రవారంనాడు  ఢిల్లీ రౌస్ ఎవెన్యూ  కోర్టులో   అరుణ్ రామచంద్రపిళ్లై  బెయిల్ పిటిషన్ పై   విచారణ సాగింది.  ఈ విచారణ సమయంలో  అరుణ్ రామచంద్రపిళ్లై   లాయర్  వాదనలు వినిపించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితకు  అరుణ్ రామచంద్ర పిళ్లై  బినామీ అని  దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ విషయమై గతంలో దాఖలు  చేసిన చార్జీషీట్లలో దర్యాప్తు  సంస్థలు  ఈ విషయాన్ని  పేర్కొన్నాయి. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  తొలుత తాను  ఇచ్చిన స్టేట్ మెంట్ ను  అరుణ్ రామచంద్రపిళ్లై  వెనక్కు తీసుకున్నారు.ఈ మేరకు  కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. బెయిల్ పై విచారణ సమయంలో కూడ  ఈ విషయాన్ని  లాయర్ ప్రస్తావించారు.  వాంగ్మూలం  ఇచ్చిన రెండు మాసాలకు  వెన్కు తీసుకున్న ఘటనలు  కూడా  ఉన్నాయని పిళ్లై తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. 

Latest Videos

ఎలాంటి ఆధారాలు లేకుండానే  అరుణ్ రామచంద్రపిళ్లైని అరెస్ట్  చేశారని  ఆయన తరపు నయ్యావాది  వాదించారు. స్టేట్ మెంట్ రికార్డు  చేసే సమయంలో అరెస్ట్  చేస్తామని  దర్యాప్తు  సంస్థలు  పిళ్లైని భయ పెట్టాయని  లాయర్  కోర్టుకు తెలిపారు. వాంగ్మూలం వెనక్కు తీసుకున్నందుకు  బెయిల్ ఇవ్వవద్దని కోరడం సరైంది కాదని  కోర్టును పిళ్లై తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.ఇరువర్గాల వాదనలు విన్న  కోర్టు  ఈ నెల  8వ తేదీన  బెయిల్ పై తీర్పును వెల్లడించనుంది. 

click me!