మద్యం సేవించి కారు నడిపిన డిగ్రీ విద్యార్థి.. ఇద్దరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం...

Published : Aug 24, 2023, 09:22 AM IST
మద్యం సేవించి కారు నడిపిన డిగ్రీ విద్యార్థి.. ఇద్దరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం...

సారాంశం

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా డిగ్రీ విద్యార్థులే. మద్యం మత్తులో కారు నడిపినట్టు సమాచారం. 

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి.. పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్థి ఇద్దరు మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో ఓ కారు ప్రమాదానికి గురైంది. మైలార్ దేవ్ పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చి డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పి కారు పల్టీలు కొట్టింది. రోడ్డుపై ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్థి చంద్రశేఖర్, అవినాష్ లు మృతి చెందారు.

Telangana assembly elections 2023: ఆ 12 మందిపై ప్రతీకారం, ప్రత్యేక వ్యూహం

అందులో ఉన్న మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. గమనించిన వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులంతా మద్యం సేవించి ఉన్నట్లుగా సమాచారం. కారు నడిపిన విద్యార్థి కూడా మద్యం సేవించినట్లు తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ