తప్పిన ప్రమాదం: సూర్యాపేట జిల్లాలో రెండు ప్రైవేట్ బస్సుల్లో చెలరేగిన మంటలు

Published : Feb 26, 2023, 09:25 AM ISTUpdated : Feb 26, 2023, 01:12 PM IST
 తప్పిన ప్రమాదం: సూర్యాపేట జిల్లాలో  రెండు ప్రైవేట్  బస్సుల్లో  చెలరేగిన మంటలు

సారాంశం

సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి  వద్ద   ఇవాళ  రెండు ప్రైవేట్  బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.

సూర్యాపేట: జిల్లాలోని దురాజ్ పల్లి  వద్ద ఆదివారం నాడు  ఉదయం రెండు ప్రైవేట్  బస్సులు దగ్దమయ్యాయి.  ఓ ప్రైవేట్  బస్సులో  షార్ట్ సర్క్యూట్  కారణంగా మంటలు  చెలరేగాయి.ఈ బస్సు పక్కనే మరో బస్సు  ఉంది.  దీంతో  మొదటి బస్సు నుండి  రెండో  బస్సుకు  మంటలు వ్యాపించాయి.ఈ మంటల్లో  రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సుల్లో  ప్రయాణీకులు  ఎవరూ  లేరు. దీంతో  పెద్ద ప్రమాదం తప్పింది. బస్సుల్లో మంటలు వ్యాపించిన  విషయాన్ని గుర్తించిన స్థానికులు  వెంటనే  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది  బస్సులో మంటలను ఆర్పివేశాయి. 

ఇవాళ తెల్లవారుజామున  మూడు గంటలకు  ప్రైవేట్ బస్సు  ఆగిపోయింది.  ఈ బస్సు  రిపేర్ కోసం  మరో బస్సులో  సిబ్బంది  వచ్చారు.    చెడిపోయిన బస్సుకు మరమ్మత్తులు చేస్తున్న సమయంలో  బస్సు బ్యాటరీలో మంటలు చెలరేగాయి.  వెంటనే  బస్సుకు మంటు వ్యాపించాయి.  ఈ బస్సు నుండి  పక్కనే నిలిపి ఉన్న మరో బస్సుకు  కూడా  మంటలు వ్యాపించాయి. మరమ్మత్తుకు  గురైన  బస్సులోని ప్రయాణీకులను  మరో బస్సులో  గమ్యస్థానాలకు పంపారు.

PREV
click me!

Recommended Stories

Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం