తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి కసరత్తు: నేతల అభిప్రాయాల సేకరణ

By narsimha lodeFirst Published Feb 24, 2020, 6:50 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం నేతల నుండి అభిప్రాయాలను ఆ పార్టీ జాతీయ నాయకత్వం  రాష్ట్రానికి చెందిన నేతల నుండి అభిప్రాయాలను సేకరించారు. 


హైదరాబాద్:బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ జాతీయ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిగా నియామకంపై బిజెపి గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది.

 బిజెపి రాష్ట్ర నేతల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని  అభ్యర్థులను ఖరారు చేసే యోచనలో జాతీయ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అధ్యక్షపదవికి పోటీపడుతున్న నేతలతోపాటు  కింది స్థాయి నేతల అభిప్రాయాలు కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది.

 సోమవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నేతల అభిప్రాయాలను జాతీయ నేతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీతో ఢీ కొట్టేందుకు బిజెపి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే విషయమై పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది.

 ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోకపోయినా రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కు దీటైన సమాధానం ఇచ్చే వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని  భావిస్తోంది.

 బీజేపీ నేతల్లో  సిట్టింగ్ ఎంపీలతో పాటు సీనియర్ నేతలు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి,మాజీ మంత్రి డీకే అరుణ బిజెపి అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

 అయితే బండి సంజయ్ పై పార్టీ నేతలు కొంతమంది అసంతృప్తి తో ఉన్నట్లు సమాచారం.  టిఆర్ఎస్ పార్టీ పై రాబోయే రోజుల్లో మరింత  దూకుడు పెంచాలని కమలనాథులు భావిస్తున్నారు. దీంతో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందో అనేది ఆసక్తి రేపుతోంది.

 రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి ఉమ్మడి రాష్ట్రంలో  రెండుసార్లు మంత్రి పదవులు నిర్వహించిన డీకే అరుణ అయితే ధీటుగా ఎదుర్కొంతుందన్న భావన  జాతీయ నేతల్లో ఉన్నట్లు తెలుస్తొంది. ఏడాది క్రితమే ఆమె పార్టీలో చేరడం అరుణకు మైనస్ పోయింట్ గా మారింది.

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి  బీజేపీ నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా అనంతరం టిడిపి, టిఆర్ఎస్ పార్టీలో కూడా పని చేసిన అనుభవం ఉంది. బిజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ అధికార పార్టీని ఆయన సమర్ధవంతమగా ఎదుర్కొంటారా ఆన్న అనుమానాలు సీనియర్లల్లో వ్యక్తమవుతున్నాయని తెలుస్తొంది.

 భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గులాబీ పార్టీ కి పోటీగా రాష్ట్ర రాజకీయాలు నడిపించే నేతకు రాష్ట్ర అధ్యక్షుడి భాధ్యతలు అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.

మాజీ గవర్నర్, సీనియర్ నేత విద్యాసాగరరావు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చురుకైన పాత్ర పోషిస్తున్నా బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్ లో లేనని ప్రకటన చేయడంతో అది కూడా పార్టీలో చర్చ జరుగుతోంది.విద్యాసాగరరావు కు వయో భారం కూడా ఆయన పదవికి అడ్డంకిగా మారుతుందని అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

Also read:బీజేపీకి కొత్త సారథులు: తెలుగు రాష్ట్రాల్లో వీరి మధ్యే పోటీ

 రాష్ట్ర నేతలకు అండదండలు అందించేందుకు  వీలుగా విద్యాసాగర్ రావు సేవలనున పార్టీ వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుంది అని మాత్రం పార్టీ నేతల్లో ఆసక్తి రేపుతోంది. కొన్ని రాష్ట్రాలకు  ఇటీవలే కొత్త అధ్యక్షులను నియమించడంతో   మరికొద్ది రోజుల్లో  పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత  తెలంగాణ పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
 

click me!