నిమ్స్‌లో డెడ్‌బాడీ కలకలం.. లిఫ్ట్ పక్కనే వదిలేసిన సిబ్బంది

Published : Apr 21, 2022, 02:45 PM IST
నిమ్స్‌లో డెడ్‌బాడీ కలకలం.. లిఫ్ట్ పక్కనే వదిలేసిన సిబ్బంది

సారాంశం

హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో డెడ్‌బాడీ కలకలం రేపింది. మార్చురీలో ఉండాల్సిన డెడ్‌బాడీని లిఫ్ట్ పక్కనే వదిలేసి వెళ్లారు. డెడ్ బాడీ కనిపించకుండా ఓ బట్టను అడ్డుగా పెట్టారు. ఈ డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించాల్సిందిగా స్టాఫ్‌కు రోగుల బంధువులు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోని వైనం చర్చనీయాంశం అవుతున్నది.  

హైదరాబాద్: నిమ్స్ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లో డెడ్‌బాడీ కలకలం రేపింది. లిఫ్ట్ పక్కనే డెడ్‌బాడీ కనిపించింది. మార్చురీలో ఉంచాల్సిన డెడ్‌బాడీని సిబ్బంది ఆ లిఫ్ట్ పక్కనే వదిలేశారు. ఆ డెడ్‌‌బాడీ ఎవరికీ కనిపించకుండా ఓ బట్టను అడ్డుగా పెట్టారు. ఈ డెడ్‌బాడీని హాస్పిటల్‌‌‌లోని రోగుల బంధువులు, ఇతరులు చూసి ఆందోళనకు గురయ్యారు. దీనిపై హాస్పిటల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా.. వారు డెడ్‌బాడీ విషయంపై స్పందించకపోవడం చర్చనీయాంశం అయింది. రోగుల బంధువులు
ఈ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న స‌మ‌యంలో ఎలుక‌ల దాడిలో గాయ‌ప‌డిన బాధితుడు శ్రీనివాస్ ఇటీవలే మృతి చెందారు. ఈ ఘ‌టన వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌ను మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్క‌డి చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించారు. 

ఉమ్మ‌డి వరంగల్ జిల్లా భీమారం ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గ‌త కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో ఆయ‌న చికిత్స కోసం ఆయ‌న వ‌రంగ‌ల్ ఎంజీఎం హాస్పిట‌ల్ లో జాయిన్ అయ్యారు. అయితే హాస్పిట‌ల్ చికిత్స పొందుతున్న స‌మ‌యంలో ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో శ్రీనివాస్ అప‌స్మార‌క స్థితిలోకి చేరుకున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కాళ్లు, చేతుల‌ను ఎలుక‌లు కొరికాయి. అయితే శ్రీనివాస్ కు చికిత్స నిర్వహించిన వైద్యులు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరించారని రోగి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క‌నీసం గాయాలు అయిన చోట కూడా చిక‌త్స చేయ‌లేద‌ని చెప్పారు. ఈ విష‌యంలో మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చిన త‌రువాత‌నే డాక్ట‌ర్లు స్పందించార‌ని చెప్పారు. 

ఈ ఘ‌ట‌న‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంది. దీనికి కార‌ణ‌మైన ప్ర‌తీ ఒక్క‌రిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?