హబ్సిగూడ చౌరస్తాలో డీసీఎం బీభత్సం..

Published : Sep 18, 2022, 10:25 AM ISTUpdated : Sep 18, 2022, 10:45 AM IST
హబ్సిగూడ చౌరస్తాలో డీసీఎం బీభత్సం..

సారాంశం

హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. హబ్సిగూడ చౌరస్తాలో వాహనాలపై డీసీఎం దూసుకెళ్లింది.

హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. హబ్సిగూడ చౌరస్తాలో వాహనాలపై డీసీఎం దూసుకెళ్లింది. వివరాలు.. వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం.. అదుపుతప్పి ఇతర వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, మూడు ఆటోలు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?