హైదరాబాద్ లో విషాదం.. కూతురు అనుమానాస్పదమృతి.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య...

By SumaBala Bukka  |  First Published Aug 28, 2023, 1:35 PM IST

ఖైరతాబాద్ లో ఓ పాప అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తండ్రి అదే రోజు రాత్రి రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో విషాదఘటన వెలుగు చూసింది. ఓ మూడున్నరేళ్ల చిన్నారి ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పాప మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు పాప తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఖైరతాబాద్ లోని కిషోర్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తన కుటుంబంతో ఓ ఫంక్షన్ కు వెళ్లాడు. ఆ తరువాత అక్కడినుంచి పాపను ఒక్కదాన్నే తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ తరువాత ఆ చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాప మృతిపై అనుమానాలుండడంతో పోస్టుమార్టం నిర్వహించగా పాప లంగ్స్ లో నీరు చేరడం వల్ల మృతి చెందినట్లుగా తేలింది.

Latest Videos

కరీంనగర్ లో దారుణం... కాకతీయ కాలువలో కొట్టుకొచ్చిన కానిస్టేబుల్ డెడ్ బాడీ (వీడియో)

మరోవైపు పాప తండ్రి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఆ తరువాత ఆయన స్నేహితులు, బంధువులకు తాను చనిపోతున్నానంటూ మెసేజ్ పెట్టాడు. వెంటనే అలర్ట్ అయిన బంధువులు వెతకడం మొదలుపెట్టగా రైలు పట్టాల మీద కిషోర్ మృతదేహం లభించింది. 

సోమవారం నాడు అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. పాప మృతి.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య ఘటనతో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం అలుముకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!