కరీంనగర్ లో దారుణం... కాకతీయ కాలువలో కొట్టుకొచ్చిన కానిస్టేబుల్ డెడ్ బాడీ (వీడియో)

By Arun Kumar P  |  First Published Aug 28, 2023, 12:33 PM IST

పెద్దపల్లి జిల్లాలో పనిచేసే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతదేహం కరీంనగర్ జిల్లా కాకతీయ కెనాల్ తేలింది. 


కరీంనగర్ : ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతదేహం నీటి కాలువలో కొట్టుకువచ్చింది. రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయిన కానిస్టేబుల్ మృతదేహం నీటిపై తేలుతూ కొట్టుకురావడం స్థానికులు గమనించారు. సమాచారం అందడంతో వెంటనే నీటికాలువ వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ కు కుటుంబంతో కలిసి నివాసముండే దుండె మల్లయ్య(50) పెద్దపల్లి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసువాడు. ఆగస్ట్ 25న (గత శుక్రవారం) అతడు పని వుందని భార్య హేమలతకు చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఇలా వెళ్లిన భర్త సాయంత్రం అయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో భార్య కంగారుపడిపోయింది. భర్త స్నేహితులు, తోటి ఉద్యోగులకు ఫోన్ చేసినా అతడి ఆఛూకీ లభించలేదు. దీంతో ఆమె కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Latest Videos

undefined

వీడియో

అయితే ఇదేరోజు మద్యాహ్నం తిమ్మాపూర్ మండల అలుగునూరు శివారులోని కాకతీయ కాలువలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని కాపాడేందకు ప్రయత్నించినా కాలువలో నీటిప్రవాహం ఎక్కువగా వుండటంతో కొట్టుకుపోయాడు. దీంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలపగా ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడున్న బైక్ ఆధారంగా కాలువలో పడి కొట్టుకుపోయింది హెడ్ కానిస్టేబుల్ మల్లయ్యగా నిర్దారించారు. 

Read More  చీరలు కొని బిల్లు కట్టబోనని బెదిరించిన పోలీసు అధికారి భార్య.. కడపలో ఘటన.. వీడియో వైరల్

రెండు రోజుల తర్వాత నిన్న(ఆదివారం) మానుకొండూరు మండలం ముంజంపల్లి శివారులోని కాకతీయ కాలువలో మృతదేహం కొట్టుకురావడం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కాలువద్దకు చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసారు. అది హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య మృతదేహమేనని నిర్దారించుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. 

ప్రమాదశాత్తు మృతిచెందిన మల్లయ్యకు శ్రీజ, కీర్తన సంతానం. భార్య హేమలత, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆనందంగా జీవిస్తున్న మల్లయ్య అనుకోకుండా ఇలా మృతిచెందాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

click me!