
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తికోసం సొంత అత్తనే హత్య చేయించింది ఓ కోడలు. వివరాల్లోకి వెళితే .. కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన లలితమ్మ అనే మహిళకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు. వీరందరికి పెళ్లిళ్లు అయ్యాయి. వివాహం సమయంలో కూతుర్లకు కట్నంగా చెరో ఎకరం ఇచ్చార లలితమ్మ దంపతులు. ఇంకా మూడున్నర ఎకరాల పొలం లలితమ్మ పేరుమీద ఉంది. అయితే ఏడాది క్రితం లలితమ్మ భర్త చనిపోయాడు. దీంతో నాటి నుంచి ఆమెపై ఉన్న మూడున్నర ఎకరాల పొలాన్ని తన పేరిట రాయాలంటూ కోడలు విజయలక్ష్మి అత్తతో గొడవ చేస్తుంది.
అంతేకాకుండా భర్త చనిపోయిన సమయంలో ఉన్న డబ్బు మొత్తం కూతుర్లకు ఇచ్చిందని.. పొలం కూడా వారికే ఇచ్చేలా ఉన్నవంటూ తరచూ లలితమ్మతో గొడవ పడేది విజయలక్ష్మి. ఎన్నిసార్లు పొలం తమ పేరుమీద రాయలని అడిగినా అత్త వినకపోవడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది విజయలక్మి. దీనిలో భాగంగా అత్త దగ్గర పొలం పని చేస్తున్న సైదులు అని కూలీని సంప్రదించి హత్యకు ఒప్పందం కుదుర్చుకుంది.
ప్లాన్‌లో భాగంగా ఒంటరిగా నిద్రిస్తున్న లలితమ్మను కత్తితో సైదులు హతమార్చాడు. అనంతరం బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సూర్యాపేట పోలీసులు. ఈ క్రమంలో మృతురాలి దగ్గర పనిచేసే సైదులు ప్రవర్తన మీద అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అనంతరం నిందితులు విజయలక్మి, సైదులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.